https://oktelugu.com/

Sai Pallavi: పునర్జన్మపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

Sai Pallavi: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని హీరోయిన్​ పేరు సాయి పల్లవి. ఫిదా సినిమాతో కుర్రాళ్ల గుండెళ్లో గుబులు పుట్టించి.. దాని కుడి భుజం మీద కడవ పాటతో ఒంపుసొంపుల హొయలతో డాన్స్​ చేసి అందరినీ తన వైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం నేచరుల్​ స్టార్ నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్​ తెరకెక్కించిన శ్యామ్​ సింగరాయ్​లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 4:57 pm
    Follow us on

    Sai Pallavi: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని హీరోయిన్​ పేరు సాయి పల్లవి. ఫిదా సినిమాతో కుర్రాళ్ల గుండెళ్లో గుబులు పుట్టించి.. దాని కుడి భుజం మీద కడవ పాటతో ఒంపుసొంపుల హొయలతో డాన్స్​ చేసి అందరినీ తన వైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం నేచరుల్​ స్టార్ నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్​ తెరకెక్కించిన శ్యామ్​ సింగరాయ్​లో నటించింది. ఇందులో కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్​లు కూడా నటిస్తున్నారు. పునర్జన్మ, బెంగాల్​ బ్యాక్​డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు.

    sai-pallavi-believes-reincarnation-and-here-how

    ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిపల్లవి.. సినిమా గురించి స్పందిస్తూ.. నానితో తను చేస్తున్న రెండో సినిమాగా చెప్పింది. తమ పాత్రల గురించి తరచూ చర్చించుకునేవాళ్లమని.. ఎడిటింగ్​ చేసేటప్పుడు సీన్లను చూసి నోట్స్ కూడా రాసుకునే వాళ్లమని చెప్పుకొచ్చింది.

    Shyam Singha Roy Telugu Trailer | Nani | Sai Pallavi | Krithi Shetty | Rahul Sankrithyan

    ఈ క్రమంలోనే పునర్జన్మపై మీ అభిప్రాయమేంటని అడగ్గా.. అప్పుడప్పుడు నేనొక యువరాణిననే ఫీలింగ్ కలుగుతుంది. నా చిన్నతనంలో ఈజిప్ట్ యువరాణులు, క్వీన్ నెఫెర్టిటిల గురించి బాగా చవిదా. కచ్చితంగా నా గత జన్మలో యువరాణి అయ్యుంటానని అనిపిస్తోంది. అని చెప్పుకొచ్చింది.  ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, రెండు భిన్న కాల క్రమాల్లో సినిమా కనిపించనుందని తెలుస్తోంది. ఒకటి హైదరాబాద్​లో జరగనుండగా.. రెండోది కలకత్తా బ్యాక్​డ్రాప్​లో జరగనుందట.