Homeఎంటర్టైన్మెంట్Virushka: ఆ విషయంలో మీడియా కి థాంక్స్ చెప్పిన అనుష్క...

Virushka: ఆ విషయంలో మీడియా కి థాంక్స్ చెప్పిన అనుష్క…

Virushka: టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క దంపతులకు వామికా అనే పాప ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పాప ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. విరుష్క జంట ఇప్పటి వరకు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేయలేదు. వామికాను ప్రపంచానికి కనిపించకుండా అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నారు కోహ్లీ.

bollywood actress anushka thanks to media bout her daughter
Anushka Sharma and Virat Kohli

సోషల్‌ మీడియాలో చిన్నారిని ముద్దు చేస్తున్నట్లున్న ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నా అందులో వామికా మాత్రం కనిపించడంలేదు. తమ చిన్నారి ప్రైవసీకి పెద్ద పీట వేయడానికే తాము అలా చేస్తున్నట్లు ఇప్పటికే చాలా సార్లు ఈ కపుల్‌ మీడియాకు చెబుతూ వస్తున్నారు. అంతటితో ఆగకుండా మీడియాను కూడా వామికా ఫోటోలు తీయకండని రెక్వెస్ట్ చేస్తూ వస్తోందీ జంట.

Also Read: బ్రేకప్ దాకా వెళ్లి.. చివరకు ఒక్కటైన కోహ్లీ, అనుష్క శర్మ..

అలానే విరుష్క జంట విజ్ఞప్తికి అనుగుణంగానే మీడియా కూడా ఇప్పటి వరకు వామికాకు సంబంధించి ఒక్క ఫోటోను కూడా పబ్లిష్‌ చేయలేదనే చెప్పాలి. అయితే ఇటీవల అనుష్క, కోహ్లీలు తమ చిన్నారితో బయటకు రాగా మీడియా వాళ్లు ఫోటోలు తీశారని వార్తల వచ్చాయి. దీంతో ఈ విషయమై అనుష్క ఫోటోలను పోస్ట్‌ చేయకండి అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. దీంతో మీడియా కూడా వామికా ఫోటోలను ఎక్కడ పబ్లిష్‌ చేయలేదు.

Also Read: టీమిండియాలో ముసలం.. కోహ్లీ వదులుకోలేదు.. తొలిగించారన్న మాట

తాజాగా అనుష్క శర్మ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ పోస్ట్‌ చేస్తూ… వామికా ఫోటోలు / వీడియోలను పోస్ట్‌ చేయనందుకు మీడియా వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తమ చిన్నారి గోప్యతను కాపాడాలను కుంటున్నామని అనుష్క చెప్పింది. అందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, కాబట్టి దయచేసి ఈ విషయంలో సంయమనం పాటించాలని ఆమె కోరారు.

Anushka Sharma Instagram Post,   Anushka and Virat with their Daughter Vamika
Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version