https://oktelugu.com/

Sai Kiran: 46 ఏళ్ళ వయస్సులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘నువ్వే కావాలి’ ఫేమ్ సాయి కిరణ్..పెళ్లికూతురు ఇండస్ట్రీ లో పెద్ద హీరోయిన్..ఎవరో తెలుసా?

సాయి కిరణ్ కి 46 ఏళ్ళ వయస్సు. ఈ వయస్సులో ఆయన పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. పెళ్ళికూతురు మరెవరో కాదు, స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ గా నిల్చిన 'కోయిలమ్మ' సీరియల్ లో స్రవంతి గా నటించిన అమ్మాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 03:25 PM IST

    Sai Kiran

    Follow us on

    Sai Kiran: మన చిన్నతనం లో చూసిన కొన్ని సినిమాలను ఎప్పటికీ మరచిపోలేము. వాటిల్లో తరుణ్ మొదటి చిత్రం ‘నువ్వే కావాలి’ ఒకటి. ఆరోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఈ చిత్రంలో ‘అనగనగా ఆకాశం ఉంది..ఆకాశంలో మేఘం ఉంది’ అని పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపించేది. కాలేజీ ఫంక్షన్స్ లో, ప్రైవేట్ ఫంక్షన్స్ లో, వినాయచవితి సమయంలో ఇలా ఎక్కడ చూసిన ఈ పాట మోతమోగిపోయే రేంజ్ లో ట్రెండ్. ఈ పాటని ఆలపిస్తూ కనిపించిన హీరో పేరు సాయి కిరణ్. ఈయన ప్రముఖ గాయకుడు రామ కృష్ణ కొడుకు. ఈ సినిమా ద్వారానే ఈయన వెండితెర అరంగేట్రం చేసాడు. తొలిసినిమా నే సూపర్ హిట్ అవ్వడంతో ఇతగాడు అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘రావే నా చెలియా’, ‘డార్లింగ్..డార్లింగ్’ వంటి హిట్ సినిమాల్లో హీరో గా నటించాడు.

    ఈ చిత్రాల తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ అనుకున్న ఫ్లాప్ అవ్వడంతో ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కొనసాగుతున్నాడు. సినీ రంగం లో పెద్దగా సక్సెస్ కాకపోయినా, సీరియల్స్ లో మాత్రం ఇతను స్టార్ నటుడు అనే చెప్పాలి. 2000 వ సంవత్సరం లో ‘శివ లీలలు’ అనే ఈటీవీ సీరియల్ లో ఈయన శ్రీ మహావిష్ణువు పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత 2007 వ సంవత్సరంలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘శ్రీ నారద లీలలు’ లో కూడా శ్రీమహావిష్ణువు పాత్ర పోషించాడు. అలా మొదలైన ఆయన సీరియల్ కెరీర్ ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలతో ముందుకు దూసుకుపోయింది. రీసెంట్ గా ఈయన 2020 వ సంవత్సరం నుండి 2024 వ సంవత్సరం వరకు స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘గుప్పెడంత మనసు’ అనే సీరియల్ లో ముఖ్య పాత్ర పోషించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. స్టార్ మా ఛానల్ లో ఈ సీరియల్ కి రికార్డు స్థాయి రేటింగ్స్ వచ్చేవి.

    ఇదంతా పక్కన పెడితే సాయి కిరణ్ కి 46 ఏళ్ళ వయస్సు. ఈ వయస్సులో ఆయన పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. పెళ్ళికూతురు మరెవరో కాదు, స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘కోయిలమ్మ’ సీరియల్ లో స్రవంతి గా నటించిన అమ్మాయి. కోయిలమ్మ సీరియల్ తో పాటుగా ఈమె అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో నటించడమే కాకుండా, పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. రీసెంట్ గానే ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆయన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయగా, అవి సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. సాయికిరణ్ కి అందరూ శుభాకాంక్షలు తెలియచేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.