Sai Dharam Tej: ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవలే బైక్‌పై నుండి కిందపడిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో గాయపడి.. దాదాపు 40 రోజులు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని.. తన పుట్టిన రోజు డిశ్చార్ అయి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లో నుండే చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, తాజాగా, ఓ ఆడియో ద్వారా అభిమానులనుద్దేశించి సందేశం ఇచ్చాడు ఈ మెగా అల్లుడు.
Also Read: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్‌కు చిరు విజ్ఞప్తి
సాయితేజ్ నటించిన రిపబ్లిస్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవ కట్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరన లభించింది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబరు 26న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే సాయి తేజ్ అభిమానులకు వాయిస్ మెసేజ్ ఇచ్చారు.. నేను మీ సాయిధరమ్‌తేజ్. నాపై మీరు చూపించిన ప్రేమకు ఎప్పడూ రుణపడి ఉంటాను. నాకు ఆరోగ్యం బాలేనప్పుడు మీరు చూపిన శ్రద్ద, ప్రేమ నేను మర్చిపోలేను. రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయా. కానీ, నవంబరు 26న జీ5లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.. అంటూ పేర్కొన్నాడుతేజ్. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిచింది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సోల్ సాంగ్ ‘జనని’.. అందులో ఉన్న డెప్త్ ఏంటేంటే?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sai dhram tej audio message for his fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com