Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ లో త్వరలోనే మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయా అంటే అవుననే అంటున్నారు. పెళ్లి చేసుకోబోతున్నాడు మరెవరో కాదు, సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీ లో మిగిలిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇతనొక్కడే. పెళ్లి టాపిక్ తీసుకొచ్చినప్పుడల్లా ఆమ్మో నావల్ల కాదంటూ తప్పించుకునే సాయి ధరమ్ తేజ్, ఎట్టకేలకు పెద్దవాళ్ళు ఒత్తిడి చేయడంతో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. చాలా కాలం నుండి సాయి ధరమ్ తేజ్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆ అమ్మాయి అంటే ఆయన తల్లికి ఇష్టం లేక పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో సాయి ధరమ్ తేజ్ ని అర్థం చేసుకొని చిరంజీవి, రామ్ చరణ్ స్వయంగా మాట్లాడి ఒప్పించినట్టు తెలుస్తుంది. ఈమె సినీ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఎవరు ఆ అమ్మాయి అనేది ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచారు.
గతం లో సాయి ధరమ్ తేజ్ రెజీనా కాసాండ్రా తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వాళ్లిద్దరూ అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. అయితే సాయి ధరమ్ తేజ్ తిక్క మూవీ హీరోయిన్ లారిస్సా బొనెసి ని ప్రేమించాడని, ఆమెకి ప్రపోజ్ చేస్తే నో చెప్పిందనేది నిజమే. ఈ విషయాన్నీ సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. గతంలో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ, ఎక్కువ కాలం నిలబడలేదని కూడా చెప్పాడు. అయితే మొత్తానికి ఇప్పుడు ఒక అమ్మాయితో స్థిరపడి, పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ పెళ్ళికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే ఒక హిట్టు ఒక ఫ్లాప్ అన్నట్టుగా సాగుతుంది. 2023 వ సంవత్సరంలో ఆయన హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది.
అదే ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘బ్రో- ది అవతార్’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ‘సంబరాల యేటి గట్టు’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. విజయదశమి కానుకగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 వ తారీఖున విడుదల చేయడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మైలు రాయిగా నిలుస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మెగా ఫ్యాన్స్.