Homeఎంటర్టైన్మెంట్పాపం బోయపాటి.. మళ్లీ మొదటికొచ్చింది !

పాపం బోయపాటి.. మళ్లీ మొదటికొచ్చింది !

Boyapati Srinu
నందమూరి బాలకృష్ణ సినిమాలు ఎలా ఉన్నా.. ఆయన సినిమాల కోసం హీరోయిన్ల ఎంపిక మాత్రం డైరెక్టర్లకు పెద్ద తలనొప్పి వ్యవహారం. అందుకే బోయపాటికి హీరోయిన్ ను ఫైనల్ చేయడం చాలా క్లిష్టంగా మారింది. ఇప్పటికే దాదాపుగా పెద్ద హీరోయిన్లు అందరూ బాలయ్యతో ఆడిపాడిన వాళ్ళే..వాళ్ళల్లో ఎవర్ని అయినా ఒప్పిద్దాం అంటే.. బడ్జెట్ తో సమస్య. మరో పక్క బాలయ్యకి ప్రస్తుతం కొత్తదనం పై మనసు మళ్లింది. కథ దగ్గర నుండి హీరోయిన్ వరకూ ప్రతిదానిలో బాలయ్య కొత్తదనం ఉండాలని పట్టు పడుతున్నారు. దాంతో బోయపాటికి ఇది పెద్ద సమస్య అయిపోయింది. అసలు బాలయ్య సినిమా అంటేనే.. హీరోయిన్లు మొహం చాటేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్-4.. అఖిల్ కరివేపాకు.. అభిజిత్ ఊర మాస్.. నెట్టింట్లో గోలగోల..!

అంజలి, నయనతార, క్యాథరిన్, ఇలా చాలామందే బాలయ్య సినిమాకు దూరం జరిగారు. అందుకే బోయపాటి శ్రీనుకు హీరోయిన్లను సెలెక్ట్ చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. దాదాపు ఏడాది పాటు గాలించి మొత్తానికి ఓ హీరోయిన్ ను పట్టాడు. మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆమె కూడా ఈ సినిమా నుండి తప్పుకుందని.. బాలయ్య సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాల్సి రావడంతో.. తానూ ఈ ఒక్క సినిమాకే డేట్స్ అన్ని ఇవ్వలేనని.. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని.. కాబట్టి ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించలేనని ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది.

Also Read: పవన్ మూవీకి త్రివిక్రమ్ సహకారం.. పారితోషికం ఎంతంటే?

దాంతో బోయపాటి ఇక చేసేదేం లేక వెంటనే మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడు. ఎవ్వరూ దొరకక పోతే.. సోనాల్ చౌహన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. పాపం బోయపాటి.. హీరోయిన్ సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. ఇక ఈ సినిమాలో రెండవ కథానాయకిగా నటి పూర్ణను ఎంచుకున్నారని టాక్. పూర్ణ ఇప్పటివరకు బాలయ్యతో నటించలేదు. ఆ మాటకొస్తే స్టార్ హీరోతో నటించడం కూడా ఆమెకు ఇదే ఫస్ట్ టైమ్. గతంలో బోయపాటితో బాలయ్య ‘సింహ, లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. అందుకే బలయ్య – బోయపాటి కాంబినేషన్ మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version