Car Sales: ఎగుమతుల రారాజు ఈ కారు కంపెనీ.. ఒక్క జూన్ లోనే ప్రభంజనం.. ధర ఎంతో తెలుసా?

Car Sales: ఇటీవల ఈ కంపెనీ చేసిన ఎగుమతులను చూసి ఆటోమోబైల్ ఇండస్ట్రీ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం 2024 జూన్ లోనే నిన్సాన్ కంపెనీ 10 వేలకు పైగా విక్రయాలు జరుపుకుంది. ఎగుమతుల రారాజుగా ఉన్న ఈ కంపెనీ వివరాల్లోకి వెళితే..

Written By: Srinivas, Updated On : July 8, 2024 10:23 am

Nissan Magnite Sales in India

Follow us on

Car Sales: కారు ఉండాలని చాలా మంది కోరుకుంటున్న నేపథ్యంలో కార్ల కంపెనీల సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయంగా మారుతి, టాటా, హ్యుందాయ్ తదితర కంపెనీలు పోటీ పడి కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటితో పాటు నిస్సాన్ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లకి వచ్చాయి. అయితే ఈ కంపెనీ కార్లను దేశీయంగా కంటే విదేశాల్లో ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇటీవల ఈ కంపెనీ చేసిన ఎగుమతులను చూసి ఆటోమోబైల్ ఇండస్ట్రీ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం 2024 జూన్ లోనే నిన్సాన్ కంపెనీ 10 వేలకు పైగా విక్రయాలు జరుపుకుంది. ఎగుమతుల రారాజుగా ఉన్న ఈ కంపెనీ వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా నిస్సాన్ కంపెనీ కార్లకు విపరీతమైన ఆదరణ ఉంది. దాదాపు 15 దేశాల్లో ఈ కంపెనీ కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నైట్ ను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇది 1,40,000 యూనిట్లు విక్రయించినట్లు సమాచారం. నిస్సాన్ మోటార్ పప్రారంభించినప్పటికి 1.1 మిలియన్ కార్లను ఎగుమతి చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే విదేశాల్లో నిస్సాన్ కు ఎంత ఆదరణ ఉందో చెప్పవచ్చు.

2024 ఏడాదిలో నిస్సాన్ మాగ్నైట్ మోడల్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఒక్క జూన్ లోనే 10,284 యూనిట్లు ఎగుమతులను సాధించింది. వార్షిక ఫలితాలతో పోలిస్తే ఇది 76.33 శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. నెలవారీ అమ్మకాల్లో 65.7 శాతంగా ఉంది. ఇదే సమయంలో దేశీయ అమ్మాకలు 2,017 యూనిట్లు గా ఉంది. దేశంలో ఎక్కువగా శ్రీనగర్, సేలం, ఢిల్లీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కంపెనీకి టచ్ పాయింట్లు ఉన్నాయి. వీటి ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

మొత్తంగా నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నైట్ విదేశాల్లో ప్రభంజనం సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ మోడల్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో పవర్ స్టీరింగ్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 98.64 బీహెచ్ పీ పవర్ వద్ద 152 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 సీటర్ అయిన ఈ కారు లీటర్ పెట్రోలక్ కు 17.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.6 లక్షల నుంచి రూ.11.27 లక్షల వరకు విక్రయిస్తున్నారు.