Rashmika Mandanna: రష్మిక మందాన కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నారు. సౌత్ టు నార్త్ దున్నేస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా రష్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సీతారామం మినహాయిస్తే ఆమె నటించిన చిత్రాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈ ప్లాప్స్ ఆమె కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇటీవల వరుసగా రెండు చిత్రాలు ప్రకటించింది. నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. రైన్ బో టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది.
ఇక రష్మిక చేతిలో రెండు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప 2లో శ్రీవల్లిగా మరోసారి అలరించనుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కుతుంది. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన టీజర్ అంచనాలకు మించి ఉంది. దర్శకుడు సుకుమార్ పార్ట్ 2 గట్టిగా ప్లాన్ చేశాడని అర్థం అవుతుంది. పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రం రష్మిక కెరీర్ కి మరింత మైలేజ్ ఇచ్చే సూచనలు కలవు.

రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో కూడా రష్మికనే హీరోయిన్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో సందీప్ రెడ్డి టాప్ డైరెక్టర్ అయ్యారు. ఆయన తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా యానిమల్ తెరకెక్కిస్తున్నారు. మరొకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
కెరీర్ జెట్ స్పీడుతో పరుగెడుతుండగా రష్మిక మందాన గ్లామర్ డోస్ పెంచేస్తుంది. ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా తగ్గేదేలే అంటుంది. తాజాగా సమ్మర్ వేర్లో దిమ్మతిరిగే ఫోజులిచ్చింది అర్ధనగ్న సౌందర్యంతో కర్ర గుండెలకు గాయం చేసింది. రష్మిక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. కాగా రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య ఎఫైర్ ఉందంటూ గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్తలను రష్మిక ఖండిస్తున్నారు. వారి ప్రవర్తన మాత్రం ప్రేమికులే అన్నట్లు ఉంటుంది.
— Rashmika Mandanna (@iamRashmika) April 27, 2023