https://oktelugu.com/

Republic Movie: త్వరలోనే ఓటిటీలోకి రానున్న సాయి ధరమ్ తేజ్ “రిపబ్లిక్’ మూవీ…

Republic Movie: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వినాయక చవితి రోజున బైక్‌ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆయనకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ను ప్రకటించారు. విలక్షణ దర్శకుడు దేవకట్ట […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 2, 2021 / 11:10 AM IST
    Follow us on

    Republic Movie: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వినాయక చవితి రోజున బైక్‌ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆయనకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ను ప్రకటించారు.

    విలక్షణ దర్శకుడు దేవకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం “రిపబ్లిక్”. ఈ మూవీ అక్టోబర్‌ 1న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాలో తేజ్‌ ఐఎస్‌ అధికారిగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేశ్‌ నటించింది.  ఈ సినిమా విడుదలకు ముందు తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురికావడంతో మూవీ ప్రచారంలో కూడా తేజ్ పాల్గొనలేదనే చెప్పాలి. ఈ తరుణం లోనే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక సంధర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమరాన్ని రేపయో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలకు పోసాని కూడా స్పంధించి రచ్చ కెక్కారు.

    అయితే ఇప్పుడు ఈ సినిమాను తాజాగా ఓటీటీలో విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ5 సంస్థ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్‌ చిత్రాన్ని ఈ నెల 26న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.