https://oktelugu.com/

Sai Dharam Tej: సాయి ధరమ్ ఫోన్ కి మెస్సేజ్, వెంటనే రంగంలోకి… మెగా హీరో చేసిన పని తెలిస్తే శభాష్ అంటారు!

బాలల అనాధాశ్రమం లో ఉన్న ఇద్దరు చిన్నారులకు వైద్య సహాయం అవసరం అయ్యిందట. ఈ విషయం తెలియజేస్తూ సాయి ధరమ్ కి సందేశం పంపారట. వెంటనే స్పందించిన సాయి ధరమ్ తేజ్... అవసరమైన ఏర్పాట్లు చేశాడట.

Written By:
  • S Reddy
  • , Updated On : February 24, 2024 / 07:01 PM IST
    Follow us on

    Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ తన మంచి మనసు చాటుకున్నాడు. ఆపదలో ఉన్న అనాధ పిల్లలకు సహాయం చేశాడు. సామ్ ధరమ్ తేజ్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ మంచి హృదయం కలిగిన హీరో. ఆయన కొన్ని వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తూ ఉంటాడు. గతంలో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయన సహాయం పొందిన వృద్ధులు త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు. తాజాగా అనాథ బాలలకు సాయి ధరమ్ తేజ్ సహాయం చేశాడు. ఈ విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

    బాలల అనాధాశ్రమం లో ఉన్న ఇద్దరు చిన్నారులకు వైద్య సహాయం అవసరం అయ్యిందట. ఈ విషయం తెలియజేస్తూ సాయి ధరమ్ కి సందేశం పంపారట. వెంటనే స్పందించిన సాయి ధరమ్ తేజ్… అవసరమైన ఏర్పాట్లు చేశాడట. చిన్నారులకు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అలాగే అనాధ బాలలు సాయి ధరమ్ తేజ్ కి ఐ లవ్ యూ చెబుతున్న వీడియో పోస్ట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ మంచి మనసు తెలుసుకున్న నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ఇక సాయి ధరమ్ తేజ్ కెరీర్ పరిశీలిస్తే… గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సాయి ధర్మ విరూపాక్ష చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ మూవీ భారీ విజయం సాధించింది. కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. సస్పెన్స్ హారర్ డ్రామాగా తెరకెక్కిన విరూపాక్ష చిత్రంలో సాయి ధరమ్ తేజ్ విలక్షణమైన రోల్ చేశారు. అనంతరం మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో చేశారు. ఇది వినోదయ సితం రీమేక్. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించారు. బ్రో ఓ మోస్తరు విజయం అందుకుంది. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో గాడ్ రోల్ చేశారు.

    నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గంజా శంకర్ టైటిల్ తో మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి రచ్చ ఫేమ్ సంపత్ నంది దర్శకుడు. గంజా శంకర్ లో సాయి ధరమ్ తేజ్ ఊరమాస్ క్యారెక్టరైజేషన్ తో మెప్పించనున్నాడట. ఈ చిత్రంలో సాయి ధరమ్ కి జంటగా పూజ హెగ్డే నటిస్తారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. గంజా చిత్రం పై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. గంజా శంకర్ చిత్రీకరణ దశలో ఉంది.