కరోనా ధాటికి రాలిపోయిన టాలీవుడ్ దర్శకుడు

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఎంతోమందిని బలితీసుకుంటోంది. చిన్నా పెద్ద.. పేద, ధనిక అని తేడా లేకుండా అందరినీ తన కోరల్లో కాటేస్తోంది. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలెబ్రెటీలు కరోనా బారినపడగా.. తాజాగా ఓ కరోనా ధాటికి ఎంతో భవిష్యత్ ఉన్న ఓ టాలీవుడ్ దర్శకుడు అసువులు బాసాడు. ప్రతిభావంతుడైన దర్శకుడు సాయి బాలాజీ మృత్యువాతపడ్డాడు.. సాయి బాలాజీ టాలీవుడ్ లో పలు సినిమాలు తీశారు. శ్రీహరితో ‘శివాజీ’ , ‘ఒరేయ్ తమ్ముడు’, ఉదయకిరణ్ తో ‘జై […]

Written By: NARESH, Updated On : April 26, 2021 5:37 pm
Follow us on

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఎంతోమందిని బలితీసుకుంటోంది. చిన్నా పెద్ద.. పేద, ధనిక అని తేడా లేకుండా అందరినీ తన కోరల్లో కాటేస్తోంది. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలెబ్రెటీలు కరోనా బారినపడగా.. తాజాగా ఓ కరోనా ధాటికి ఎంతో భవిష్యత్ ఉన్న ఓ టాలీవుడ్ దర్శకుడు అసువులు బాసాడు. ప్రతిభావంతుడైన దర్శకుడు సాయి బాలాజీ మృత్యువాతపడ్డాడు..

సాయి బాలాజీ టాలీవుడ్ లో పలు సినిమాలు తీశారు. శ్రీహరితో ‘శివాజీ’ , ‘ఒరేయ్ తమ్ముడు’, ఉదయకిరణ్ తో ‘జై శ్రీరామ్’ సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘బావగారు బాగున్నారా’కి స్క్రీన్ ప్లే రచయితగా కూడా వ్యవహరించారు. ”సిరి”, “అపరంజి” “హాలాహలం”. సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. . స్క్రీన్ ప్లే , ప్రపంచ సినిమాఫై మంచి పట్టు ఉన్న వ్యక్తిగా టాలీవుడ్ లో గుర్తింపు పొందారు.

సినిమా దర్శకుడు, రచయతగా పేరుగాంచిన ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్ (ఎన్ . వర ప్రసాద్ )కు ఇటీవల కరోనా సోకింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలి లోని టిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుఝామున మరణించారు.

సాయిబాలాజీ వయసు 57 సంవత్సరాలు. మెగాస్టార్ హీరోగా నాగబాబు నిర్మాతగా అంజనా ప్రోడ్సక్షన్స్ పతాకం పై నిర్మించిన ”బావగారు బాగున్నారా” చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో ఒకరు. తిరుపతి ఆయన స్వస్థలం. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖ లో శిక్షణ పొందారు.

సాయి బాలాజీ ప్రసాద్ కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. ఈయన మృతిపై సినిమా, టివి రంగాలకి చెందిన పలువురు సంతాపం తెలిపారు.