
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ తారలంతా కరోనా కల్లోలంతో సినిమాలు వాయిదా పడి.. షూటింగ్ లు నిలిచిపోవడంతో సముద్రంలోని ద్వీప దేశమైన మాల్దీవులకు తరలివెళ్తున్నారు. ముంబై నుంచి విమానం ఎక్కి ఆ సముద్ర దేశంలోని బీచ్ లలో బికినీలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తే చేయని.. కానీ ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ నెటిజన్లకు కాక పుట్టిస్తున్నారు. కన్నులవిందు చేస్తున్నారు.
ఇక రెగ్యులర్ షూటింగ్ లకు కరోనాతో ఇలా విరామం వస్తే చాలు సినీ తారలు వెంటనే మాల్దీవులకు ఇటీవల వెళతున్నారు.. బాలీవుడ్ ప్రముఖుల కారణంగా మాల్దీవులు ఇప్పుడు రెండో ముంబైగా మారింది.. మాల్దీవులలో పుట్టినరోజులు లేదా వివాహాల దినోత్సవాలను జరుపుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
ఈ పర్యటనలు ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఇటీవల వివాహం చేసుకున్న జంటలకు మల్దీవులు స్వర్గధామం అయ్యింది. ఆ దేశం హనీమూన్ ప్యాకేజీలను అందిస్తుంది. చాలామంది హీరోయిన్లు అక్కడ హాట్ ఫోటోషూట్లు చేసి, ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అలరిస్తున్నారు. ఇటీవల నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి వారు హాట్ ఫొటో షూట్ లకు వ్యతిరేకంగా అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు సినీ సెలబ్రెటీలకు మల్దీవులు దేశం షాక్ ఇచ్చింది. భారతదేశం నుండి పర్యాటకుల రాకపై తాత్కాలిక నిషేధం విధించింది.ఈ మేరకు మల్దీవుల పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ నిషేధం ఏప్రిల్ 27 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఈ నిషేధం తర్వాత నెటిజన్లు బాలీవుడ్ తారలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇక బాలీవుడ్ హీరోయిన్ల బికినీ ఫోటోలను చూడలేమా అంటూ నెటిజన్లు మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు.
Alia bhat and other bollywood people be like: pic.twitter.com/Fqqj07Ote3
— Raghav gupta (@Ragstargupta3) April 25, 2021