https://oktelugu.com/

King Nagarjuna: వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకుంటానన్న కింగ్ నాగార్జున…

King Nagarjuna: కింగ్ నాగార్జున ఒకవైపు సినిమాల పరంగా దూసుకుపోతూ బిగ్ బాస్ షో ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపై ప్రసారం అవుతున్న తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సీజన్ 5 మిగతా సీజన్స్ కంటే చాలా భిన్నంగా మారింది. బిగ్ బాస్ గేమ్ ఎండింగ్‌కి చేరుకుంది. కేవ‌లం ఒకే వారం మాత్ర‌మే మిగిలి ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవ‌రో కూడా తేలిపోయింది. ఈ తరుణంలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 11:46 AM IST
    Follow us on

    King Nagarjuna: కింగ్ నాగార్జున ఒకవైపు సినిమాల పరంగా దూసుకుపోతూ బిగ్ బాస్ షో ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపై ప్రసారం అవుతున్న తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సీజన్ 5 మిగతా సీజన్స్ కంటే చాలా భిన్నంగా మారింది. బిగ్ బాస్ గేమ్ ఎండింగ్‌కి చేరుకుంది. కేవ‌లం ఒకే వారం మాత్ర‌మే మిగిలి ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవ‌రో కూడా తేలిపోయింది. ఈ తరుణంలో నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అకస్మాత్తుగా తెలుగు బిగ్‌బాస్‌ షోలో సందడి చేశారు. వాతావరణ మార్పులను అడ్డుకోవాలంటే ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ఊరి కోసం, భవిష్యత్‌ తరాల కోసం ప్రతి ఒక్కరూ ప్రతి చోటా మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

    ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రచారానికి గానూ ఆయన ఈ బిగ్ బాస్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హీరో అక్కినేని నాగార్జున ఈ షోలో ప్రకటించారు. అడవుల పరిరక్షణ కోసం గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమం ద్వారా ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే అడవిని దత్తత తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంపీ సతోస్ కుమార్ తో కలిసి మొక్క నాటారు నాగార్జున. అయితే, హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అడవులు ఉన్నాయని వాటిని దత్తత తీసుకోవచ్చని ఎంపీ తెలిపారు. కాజల్ అవుట్ అవ్వడంతో… ఇప్పుడు హౌస్ లో ఐదుగురు శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షన్ను మిగిలారు.