RX100 hero Kartikeya latest news: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఈమధ్య కాలంలో వచ్చిన అనేక మంది హీరోలు సక్సెస్ అయ్యారు. నాని వంటికి వారు అయితే స్టార్ హీరో లీగ్ కి అడుగు దూరం లో ఉన్నారు. #RX100 హీరో కార్తికేయ కూడా ఇలా పెద్ద రేంజ్ కి వెళ్లాడని అంతా అనుకున్నారు. ఆ సినిమాలో ఆయన నటన చూసి, కుర్రాడు ఎవరో కానీ చాలా బాగున్నాడు, నటన , డ్యాన్స్ , ఫైట్స్ కూడా అదరగొట్టేస్తున్నాడు. కచ్చితంగా మరో నాని , విజయ్ దేవరకొండ అవుతాడని అంతా అనుకున్నారు. దానికి తగ్గ సినిమాలు కూడా చేసాడు . ఈ చిత్రం తర్వాత ఆయన హీరో గా నటించిన గుణ 369 , 90ML , బెదురులంక 2012 వంటి చిత్రాలు కమర్షియల్ గా బాగానే ఆడాయి.
కేవలం హీరో రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, విలన్ రోల్స్ కూడా చేసాడు. నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘గ్యాంగ్ లీడర్’, తమిళ స్టార్ హీరో అజిత్ హీరో గా నటించిన ‘వలిమై’ వంటి చిత్రాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు ని సంపాదించుకున్నాడు. ఆడియన్స్ కి బాగా దగ్గర అవుతున్నాడు అని అనుకుంటున్న సమయం లో అకస్మాత్తుగా ఇతను మాయం అయిపోయాడు. ఈయన చివరిసారిగా వెండితెర కి కనిపించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ సినిమా 2024 వ సంవత్సరం లో విడుదలై యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత ఎటు పోయాడో ఎవరికీ తెలియదు. అయితే గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆయన పుట్టిన రోజు నాడు ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ ని బట్టీ చూస్తుంటే కార్తికేయ సినిమాలను పూర్తిగా వదిలేయలేదు అనే విషయం మాత్రం తెలుస్తోంది.
ఆ ట్వీట్ లో ఏముందంటే ‘నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆశీస్సులే నా బలం. అందరూ నా తదుపరి చిత్రం ఏంటి అని అడుగుతున్నారు. మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. వర్క్ ప్రోగ్రెస్ లోనే ఉంది. కాస్త ఓపిక పట్టండి , బ్లాస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకొస్తాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఇతను అవకాశాలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడా? , లేకపోతే ఇంట్లో కొన్ని సంఘటనలు జరగడం వల్ల తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే , ఇంట్లో ఏర్పడిన కొన్ని సంఘటనల కారణం గానే ఆయన సినిమాలకు దూరం గా ఉన్నట్టు తెలుస్తోంది .మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, పెద్ద రేంజ్ కి వెళ్లగలడు, అనవసరం సమయం , వయస్సు వృధా చేయకు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కార్తికేయ కి చెప్తున్నారు.