https://oktelugu.com/

Balakrishna: బాలయ్య – బోయపాటి కాంబో మళ్ళీ రిపీట్ కానుందా…

Balakrishna: సింహా సినిమాతో మొదలైన ప్రయాణం అఖండ మూవీతో అఖండమైన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బోయపాటి,  నటసింహం బాలయ్య. వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన సింహ, లెజెండ్ ,అఖండ హ్యాట్రిక్ విజయం అందుకోగా ఈ ఏడాది కలెక్షన్ కింగ్ గా  మారారు బాలయ్య. కరోనా తర్వాత వచ్చిన పెద్ద సినిమా అవ్వడం..పైగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇదిలా ఉంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్లు సోషల్ మీడియాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 08:50 PM IST
    Follow us on

    Balakrishna: సింహా సినిమాతో మొదలైన ప్రయాణం అఖండ మూవీతో అఖండమైన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బోయపాటి,  నటసింహం బాలయ్య. వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన సింహ, లెజెండ్ ,అఖండ హ్యాట్రిక్ విజయం అందుకోగా ఈ ఏడాది కలెక్షన్ కింగ్ గా  మారారు బాలయ్య. కరోనా తర్వాత వచ్చిన పెద్ద సినిమా అవ్వడం..పైగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇదిలా ఉంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

    డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవలే జరిగిన అఖండ సక్సెస్ మీట్ లో దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ… బాలయ్యతో ఒక్క సినిమా చేస్తే చాలు అని చాలామంది ఎదురు చూస్తుంటారు. అలాంటిది తనకు మూడు సినిమాలు చేసే అవకాశం దక్కిందని చెప్పుకోచ్చారు. అయితే ఇదే సందర్భంలో ప్రేక్షకుల నుంచి మరో సినిమా ఉంటుందా ? అని ప్రశ్నరావడంతో బోయపాటి స్పందిస్తూ ఆయనతో సినిమా తప్పకుండా చేస్తా అంటూ సమాదానం ఇచ్చారు. ఈ మాటలతో బాలయ్య- బోయపాటి కాంబోలో మరో సినిమా రాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మరో సినిమా ఇద్దరికాంబినేషన్ లో వస్తే ఈ సారి ఎలాంటి సినిమా వస్తుందో చూడలి. ప్రస్తుతం దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రం నటిస్తున్నారు బాలకృష్ణ . ఈ ఈ చిత్రం కూడా పవర్ ఫుల్ కథతో తెరకెక్కుతుందని సమాచారం. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత  డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు బాలయ్య. ఆ తర్వాత మరి వీరి కాంబోలో మూవీ రావొచ్చేమో.