https://oktelugu.com/

Bollywood: విక్ట్రీనా పెళ్లి ఫొటోలు చూసి సమంతను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు…

Bollywood: బాలీవుడ్‌ సీక్రెట్ లవ్‌ బర్డ్స్‌ కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం విక్ట్రీనా జంట పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఈ గురువారం రాజస్థాన్ లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో సన్నిహితులు సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు ఈ జంట. పెళ్లి దుస్తుల్లో మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌లా ఉన్నారు వీరిద్దరు. ముఖ్యంగా కత్రీన సబ్యసాచి డిజైన్‌ చేసిన ఎరుపు లెహంగాలో మహారాణిలా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 08:57 PM IST
    Follow us on

    Bollywood: బాలీవుడ్‌ సీక్రెట్ లవ్‌ బర్డ్స్‌ కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం విక్ట్రీనా జంట పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఈ గురువారం రాజస్థాన్ లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో సన్నిహితులు సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు ఈ జంట. పెళ్లి దుస్తుల్లో మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌లా ఉన్నారు వీరిద్దరు. ముఖ్యంగా కత్రీన సబ్యసాచి డిజైన్‌ చేసిన ఎరుపు లెహంగాలో మహారాణిలా అందంగా మెరిసిపోయింది.

    వీరి వివాహం జరుగుతున్న సమయంలో కత్రిన భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమించిన వాడిని జీవిత భాగస్వామిగా పొందుతున్న వేళ పట్టరాని సంతోషంతో కత్రినా ఉద్వేగానికి గురయ్యారు. ఇక విక్కీ చేతిని ఆమె వీడనంటూ గట్టిగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరలవుతోంది. ఆ ఫోటో ను చూసిన నెటిజనులు నాగ చైతన్య –  సమంతను గుర్తు చేసుకున్నారు. సామ్ – చైతూతో వివాహం జరుగుతున్న సమయంలో ​సామ్ కూడా ఇలానే పట్టరాని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. విక్ట్రీనా పెళ్లిలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అవ్వడంతో నెటిజన్లు  దృష్టిని ఈ సీన్ ఆకర్షించింది. ఈ బాలీవుడ్‌ నూతన దంపతులకు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న వీరి రిసెప్షన్ వేడుకలో బాలీవుడ్ తారలు అందరూ మెరవనున్నారు. చూడాలి మరి ఈ వేడుకలో కత్రినా మాజీ ప్రేమికులు ఉంటారో లేదో అనేది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.