Homeఎంటర్టైన్మెంట్Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడో తెలుసా ...

Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడో తెలుసా …

Thaman: ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు తమన్. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో తమన్ పని చేశారు. మహేష్ బాబుతో సర్కారు వారి పాట, పవన్‌తో భీమ్లానాయక్, చిరంజీవితో గాడ్ ఫాదర్, రామ్ చరణ్- శంకర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు తమన్. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’కు కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని బాలయ్య అభిమానులు తనను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

rumours on social media about music director thaman remunaration

తమన్‌ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. అలానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉంటారు. నెటిజన్లు మీమ్స్ ద్వారా ఆయన్ను ఎంతగా ట్రోల్ చేస్తారో… అంతే అభిమానిస్తారు. ఇతర సంగీత దర్శకులతో పోలిస్తే తమన్ పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు తమన్ రెమ్యునరేషన్ ఎంత అన్న సందేహం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాగా తమన్ ఒక్కొక్క సినిమాకు దాదాపు రెండున్నర నుండి మూడున్నర కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకుంటాడని టాక్ నడుస్తుంది. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్‌కు వచ్చే రెమ్యునరేషన్‌లో వారు సౌండ్ ఇంజనీర్లకు, మ్యూజిక్ ప్లేయర్స్‌కు, మిక్స్ ఇంజనీర్లకు కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అలా మొత్తంగా కలిపితే తమన్ రెమ్యునరేషన్ ఇంత భారీగా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు తమన్ చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలను చేస్తూనే.. త్వరలో పట్టాలెక్కబోతున్న సినిమాలకు కూడా రెడీ అవుతున్నాడు తమన్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version