Vijay Varasudu Movie: వంశీ పైడిపల్లికి తెలుగులో పెద్ద చిత్రాల దర్శకుడిగా మంచి పేరు ఉంది. ఇలాంటి డైరెక్టర్ తో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా సినిమా చేస్తున్నాడు అనేసరికి, ఈ సినిమా పై ఇటు టాలీవుడ్ లో, అటు కోలీవుడ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, వంశీ పైడిపల్లి ఈ సినిమాకు ‘వారసుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. తెలుగులో ‘వారసుడు’, తమిళంలో ‘వరిసు’.

ఇప్పుడు ఈ టైటిలే ఆసక్తిగా మారింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుంచి.. ఈ సినిమా కథకి రాజకీయాలకు మధ్య ఎదో సంబంధం ఉందని ఇండస్ట్రీలో పుకారు పుట్టింది. జయలలిత వారసుడిగా విజయ్ ను ప్రమోట్ చేసే క్రమంలోనే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టారని టాక్. మరోపక్క మరో రూమర్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.
Also Read: Jabardasth Naresh: జబర్ధస్త్ నరేష్ జీవితంలో ఆ విషాదం పూడ్చలేనిదట.. అతడి వయసు ఎంతో తెలుసా?
వంశీ గతంలో తాను ఎన్టీఆర్ తో తీసిన ‘బృందావనం’ సినిమా కథని అటు, ఇటు మార్చి.. వారసుడు కోసం ఓ పెద్ద కుటుంబం ఎదురుచూస్తూ ఉంటుందని.. అలాంటి సమయంలో విజయ్ ఆ ఇంటికి వారసుడిగా ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ సినిమా కథ గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అన్నట్టు ఆ మధ్య “లార్గోవించి” అనే ఫ్రెంచి సినిమా కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుందని కూడా ప్రచారం జరిగింది. ఏది ఏమైనా తమిళనాట విజయ్ సూపర్ స్టార్. ఆ రేంజ్ హీరో సినిమా కథ కాపీ అంటే సినిమా పైనే ప్రభావం పడుతుంది. కాబట్టి.. వంశీ పైడిపల్లి తన సినిమా కథ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. వంశీ పైడిపల్లి ఇప్పటికే నేషనల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలు అందరితో సినిమాలు చేశాడు.
ఇప్పుడు ఏకంగా తన కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ స్టార్ అయిన తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. అన్నిటికీ మించి తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. మరి ఇది ఏ స్థాయి హిట్ అవుతుందో చూద్దాం.
[…] Also Read: Vijay Varasudu Movie: ‘వారసుడు’ కథ పై వదంతులు.. సీఎం… […]
[…] Also Read: Vijay Varasudu Movie: ‘వారసుడు’ కథ పై వదంతులు.. సీఎం… […]