Ranga Marthanda: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. లోగో డిజైన్ చాలా బాగుంది.

ఇక త్వరలోనే రంగమార్తాండ సినిమా టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అమ్మానాన్నల కథ గా రంగమార్తాండ థియేటర్స్ కు రానుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుంది. కృష్ణవంశీ తన సినీ కెరీర్ లోనే ఈ సినిమా కోసం తీసుకున్నన్నీ జాగ్రత్తలు, మరో సినిమా కోసం తీసుకోలేదు.
Also Read: Vijay Varasudu Movie: ‘వారసుడు’ కథ పై వదంతులు.. సీఎం జయలలిత వారసుడిగా స్టార్ హీరో ?
ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలి అని కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అనసూయ పాత్ర చాలా బలమైనదట, కృష్ణవంశీ ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన జంట.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యువ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ యువ జంటగా కనిపిస్తారు. అలాగే తెలుగు వాళ్లకు హాస్యం అంటే మహా ఇష్టం. ఐతే, ఆ హాస్యానికి బ్రహ్మానందం అనే పేరు పర్యాయపదం అయిపోయింది. అంత గొప్ప కమెడియన్ ఈ సినిమాలో ఎమోషనల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. తన భావోద్వేగాలతో మంత్రముగ్ధుల్ని చేస్తాడట.
Also Read:Jabardasth Naresh: జబర్ధస్త్ నరేష్ జీవితంలో ఆ విషాదం పూడ్చలేనిదట.. అతడి వయసు ఎంతో తెలుసా?