NTR- Keerthy Suresh: కీర్తి సురేష్ పై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. అది ఆమెకు నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టే పుకారు. నిజానికి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదట. ఇదంతా ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న నిర్వాకమని తేలిపోయింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ పక్కన ఛాన్స్ వస్తే ఎవరైనా కాదంటారా?. కీర్తి సురేష్ అన్నారట. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంకా హీరోయిన్ ఎంపిక జరగలేదు. గతంలో అలియా భట్ అనుకున్నారు. వ్యక్తిగత కారణాలతో అలియా ప్రాజెక్ట్ ఒప్పుకొని కూడా తర్వాత తప్పుకున్నారు.

అంతకు ముందు కియారా అద్వానీ చేయను అన్నారు. ఈ రెండు కారణాలు అడ్డుపెట్టుకొని ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ ఒక వాదన తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరకడం లేదట. ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ కోసం ఎవరిని సంప్రదించినా చేయమని చెప్పేస్తున్నారట. తాజాగా కీర్తి సురేష్ సైతం ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారట, అని ఒక పుకారు లేపారు. ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆయనంటే గిట్టనివారు ఈ పుకారు పుట్టించారని సమాచారం అందుతుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఎన్టీఆర్ 30 యూనిట్ కీర్తి సురేష్ ని కలిసిందే లేదట. ఆమెకు కొరటాల నుండి ఎలాంటి ఆఫర్ రాలేదట. జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని యూనిట్ స్పష్టత ఇచ్చారు. ఇది తెలియని కొందరు కీర్తి సురేష్ ని తిట్టుకుంటున్నారు. మా హీరోతో సినిమా చేయనంటావా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఎవరో పుట్టించిన పుకారుకు కీర్తి సురేష్ నెగిటివిటీ మూటగట్టుకుంటున్నారు. నిజంగా ఎన్టీఆర్ 30లో ఆఫర్ వస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.

ఎందుకంటే ప్రస్తుతం కీర్తి చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. నానితో దసరా మూవీ చేస్తుంది. భోళా శంకర్ పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ.. అందులో ఆమెది చెల్లెలు పాత్ర. వీటితో పాటు ఒక తమిళ చిత్రం మాత్రమే చేస్తున్నారు. ఈ టైంలో ఆమెకు ఎన్టీఆర్ 30 ఆఫర్ వస్తే కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. సినిమా హిట్ అయితే మరలా టాలీవుడ్ లో బిజీ కావడానికి మార్గం ఏర్పడుతుంది. మరోవైపు ఎన్టీఆర్ 30 షూటింగ్ అంతకంతకు ఆలస్యం అవుతుంది. దీంతో అనేక దుష్ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల ప్రాజెక్ట్ అయిపోయినట్లు ప్రచారం జరిగింది.