https://oktelugu.com/

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ పెళ్లి.. ఈసారి అమ్మాయి ఎవరంటే?

రీసెంట్ గా మంచు లక్ష్మి నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్ లో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రదీప్ కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 21, 2024 / 05:48 PM IST

    Anchor Pradeep

    Follow us on

    Anchor Pradeep: బుల్లితెర స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. తనదైన స్టైల్ లో హోస్టింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రదీప్ కామెడీ టైమింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. స్పాంటేనియస్ గా పంచులు వేస్తూ .. తన బాడీ లాంగ్వేజ్ తో కడుపుబ్బా నవ్విస్తాడు. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే…. సినిమాల్లో కూడా నటిస్తున్నారు. మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ప్రదీప్ .. హీరోగా మారి ‘ 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా ‘ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది.

    కాగా ఇంకా పెళ్లి చేసుకోని ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు.ఈ క్రమంలో ప్రదీప్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే తరచూ అతని పెళ్లి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి గురించి రచ్చ మొదలైంది. ప్రదీప్ మాచిరాజు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఏకంగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    రీసెంట్ గా మంచు లక్ష్మి నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్ లో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రదీప్ కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు. మెరూన్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిశాడు. కాగా ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. సదరు ఫోటోలను చూసిన ఫ్యాన్స్… మీకు పెళ్లి ఎప్పుడు? మీ ఫేస్ లో పెళ్లి కళ ఉట్టిపడుతుంది .. అందుకేనా షోస్ మానేశారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇంకొందరేమో… ఏంటి బ్రో షోస్ లో కనిపించడం లేదు .. మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ ఎలాంటి షోలు చేయడం లేదు. ఇందుకు కారణం ఏమిటో తెలియదు. ఇటీవల ఢీ షో నుంచి కూడా ప్రదీప్ తప్పుకున్నాడు. ఢీ 9 నుంచి ఢీ 14 వరకు సుదీర్ఘ కాలం వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఢీ షో లో హైపర్ ఆది, ప్రదీప్ కాంబినేషన్ అదుర్స్ అని చెప్పాలి.