Pushpa 2 , Chhaava
Pushpa 2 and Chhaava : బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్రాలలో ఒకటి ‘చావా'(Chhaava Movie). ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. యంగ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) శంభాజీ క్యారక్టర్ చేయగా, ఆయన సతీమణి యేసుబాయి క్యారక్టర్ లో హీరోయిన్ రష్మిక(Rashmika Mandana) నటించింది. నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ సెన్సేషనల్ గా వచ్చాయి. బుక్ మై షో యాప్ లో గంటకి 50 వేలకు పైగా టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి. పుష్ప 2(Pushpa 2 Movie) , కల్కి(Kalki 2898 AD) తర్వాత ఆ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమాకే మనం చూశాము. కేవలం హిందీ భాషతో ఈ రేంజ్ ర్యాంపేజ్ అనేది సాధారణమైన విషయం కాదు. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదలైన సినిమాలకు ఇలాంటి బుకింగ్స్ జరగడం ఇది వరకు మనం చూశాము.
అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి కచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు హిందీ వెర్షన్ వరకు పుష్ప 2 మొదటి రోజు వసూళ్లను అధిగమిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందులో సగం కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ‘పుష్ప 2’ కి మొదటిరోజు హిందీ వెర్షన్ లో దాదాపుగా 72 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తే , ‘చావా’ చిత్రానికి కేవలం 33 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. విక్కీ కౌశల్ రేంజ్ కి ఇది చాలా పెద్ద ఓపెనింగ్, కానీ భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో పుష్ప 2 బ్రేక్ అవుతుందని అనుకున్నారు, కానీ అది జరగలేదు. మహారాష్ట్ర సర్క్యూట్ లో సెన్సేషనల్ వసూళ్లు నమోదు అయ్యాయి కానీ, మిగిలిన ప్రాంతాల్లో నార్మల్ ఓపెనింగ్ మాత్రమే తక్కింది.
కానీ ఈ చిత్రానికి లాంగ్ రన్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అనేది బలంగా చెప్పొచ్చు. రెండవ రోజు వచ్చే వసూళ్లు మొదటి రోజు కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయట. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం గంటకు 51 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలోనే ఈ రేంజ్ లో ఉందంటే, ఇక సాయంత్రం సమయంలో బుక్ మై షో ట్రెండ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. వీకెండ్ కి వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్న ఈ సినిమాకి, ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగితే 300 కోట్ల నుండి 400 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రావొచ్చు. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అందరు అనుకున్నారు కానీ, ఆ స్థాయికి చేరుకోవడం ప్రస్తుతానికి కష్టమే. లాంగ్ రన్ లో ఏదైనా మ్యాజిక్ జరిగితే సాధ్యపడొచ్చేమో చూడాలి.