Kiran Abbavaram
Kiran Abbavaram: చెప్పి హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. ఆయన గత చిత్రం ‘క’ భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ మూవీ బడ్జెట్ రీత్యా ఈ వసూళ్లు చాలా ఎక్కువ. థియేటర్స్ దొరక్క క మూవీ వసూళ్లు తగ్గాయి. లేదంటే ఈ ఫిగర్ ఇంకా పెద్దదిగా ఉండేది. క మూవీ లక్కీ భాస్కర్, అమరన్ నుండి గట్టి పోటీ ఎదుర్కొంది. క మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అబ్బవరం ఒకింత ఎమోషనల్ అయ్యాడు. నన్ను, నా సినిమాలను ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించాడు. క మూవీ అందరూ చూడండి. ఈ సినిమా బాగుంటుంది. నచ్చకపోతే అసలు సినిమాలు చేయడం మానేస్తా.. అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
Also Read: సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కోసం ఆ స్టోరీ ని రెడీ చేశారా..? కథ మామూలుగా లేదుగా…
క విజయంతో జోరుమీదున్న కిరణ్ అబ్బవరం దిల్ రుబా అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. దిల్ రుబా మూవీ మార్చ్ 14న థియేటర్స్ లోకి రానుంది. దిల్ రుబా మూవీలో రుక్షర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. విశ్వ కరుణ్ దర్శకుడు. మూవీ విడుదలకు రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కాగా కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు చిన్న కాంటెస్ట్ పెట్టాడు. దిల్ రుబా మూవీ కథను ఖచ్చితంగా ఊహించి చెప్పిన వారికి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్ గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించాడు. అలాగే ఆ బైక్ పై గెలుచుకున్న వ్యక్తితో పాటు వెళ్లి దిల్ రుబా మూవీ చూస్తా అని ప్రకటించాడు.
దిల్ రుబా చిత్రానికి ప్రచారం కల్పించేందుకు కిరణ్ అబ్బవరం క్రేజీ ఆలోచన చేశాడు. బైక్ తో పాటు కిరణ్ అబ్బవరం తో కలిసి మూవీ చూసే అవకాశం గెలుచుకోవాలంటే దిల్ రుబా మూవీ కథ ఏమిటో కనిపెట్టి చెప్పడమే. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో కిరణ్ అబ్బవరం చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. మరి మీకు ఆసక్తి ఉంటే ఒక ట్రయిల్ వేయండి. దిల్ రుబా టీజర్ ఆకట్టుకుంది. ఒకసారి ప్రేమలో విఫలమైన హీరో మందుకు బానిస అవుతాడు. ఆ క్రమంలో అతని జీవితంలోకి మరో అమ్మాయి వస్తుందని టీజర్ ద్వారా అర్థం అవుతుంది. దిల్ రుబా చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు…