Priyanka Chopra: దాంపత్య జీవితంలో సర్దుకు పోవడం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య గొడవలు అనేది చాలా సహజం. అయితే పరువు కోసం, సొసైటీ కోసం, పేరెంట్స్ కోసం 90 శాతం జంటలు మ్యారీడ్ లైఫ్ కంఫర్ట్ గా లేకున్నా అడ్జస్ట్ అవుతారు. సెలెబ్రిటీలు మాత్రం ఇవేమీ పరిగణలోకి తీసుకోరు. కొంచెం ఇబ్బంది అనిపించినా ‘లెట్స్ బ్రేకప్ ‘ అంటారు. విభేదాలు, ఇబ్బందులు ఏర్పడితే, చాలా తేలికగా విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతారు.

ముఖ్యంగా సినిమా స్టార్స్ ప్రేమలు, పెళ్లిళ్లపై జనాలకు పెద్దగా నమ్మకం ఉండదు. వీళ్లు ఎప్పుడు విడిపోతారో వాళ్ళకే తెలియదు అనుకుంటారు. ఈ అభిప్రాయం జనాల్లో బలపడడానికి వందల జంటలు విడాకులతో విడిపోవడమే. ఇటీవల సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు.తాజాగా ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ కి టాటా చెప్పేస్తుదంటూ రూమర్స్ బయలుదేరాయి.
దానికి కారణం, ఆమె సమంత తరహా హింట్ ఇచ్చింది. మూడు నెలల క్రితం సమంత సోషల్ మీడియాలో పేరు మార్చేశారు. తన పేరు ముందు ఉన్న అక్కినేని ఇంటి పేరును తొలగించారు. అప్పటి నుండే సమంత-చైతన్య విడాకులు రూమర్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 2 సమంత, చైతూ స్వయంగా తాము విడిపోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక సైతం తన పేరు నుంచి భర్త ఇంటి పేరును తొలగించింది. సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా జోనాస్ కాస్తా, ప్రియాంక చోప్రా గా మార్చింది. సమంత విడాకుల విషయంలో ఎదురైన అనుభవం రీత్యా ప్రియాంక-నిక్ జోనాస్ విడాకుల వార్తలు మొదలయ్యాయి. ప్రియాంక సోషల్ మీడియా నుంచి భర్త పేరు తొలగించడానికి కారణం వారి మధ్య ఏర్పడిన గొడవలే, ఈ జంట విడిపోవడం ఖాయం అంటూ కథనాలు వెలువడుతున్నాయి.
Also Read: Naga Chaitanya: జోష్ టూ లవ్ స్టోరీ.. బర్త్ డే బాయ్ నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ చిత్రాలు ఇవే!
వరుస కథనాల నేపథ్యంలో ప్రియాంక ఖండించారు. నిరాధారమైన వార్తలు రాయవద్దన్నారు. అలాగే నిక్ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేయగా, ప్రియాంక రొమాంటిక్ కామెంట్ కూడా చేశారు. 2018లో అమెరికన్ సింగర్ యాక్టర్ నిక్ జోనాస్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రియాంక. రాజస్థాన్ లో హిందూ సాంప్రదాయంలో ఘనంగా వీరి వివాహాం జరిగింది.
వయసులో నిక్ ప్రియాంక కంటే పదేళ్లు చిన్నవాడు కావడం విశేషం. ప్రస్తుతం ఈ జంట న్యూయార్క్ నగరంలో కాపురం ఉంటున్నారు.
Also Read: Acharya: ‘ఆచార్య’ నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్కు రెడీగా ఉన్నారా?