Ponniyin Selvan Vs RRR: పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఆర్ ఆర్ ఆర్ రైటర్ ట్రోల్ చేయడం సంచలనమైంది.ఏకంగా ఆయన తన ట్వీట్ లో చిత్ర టైటిల్ పన్నీరు సెల్వం అని పొందుపరిచారు. విషయంలోకి వెళితే… అమృతం ఫేమ్ ఎస్ ఎస్ కాంచీ రాజమౌళికి కజిన్ అవుతారు. ఆయన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సహ రచయితగా ఉన్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్ గా రాజమౌళి చిత్రాలకు పని చేస్తూ ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ కథ, స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో కాంచీ పాత్ర కూడా ఉంది. విజయేంద్ర ప్రసాద్ తో పాటు ఆయన పనిచేశారు. కాగా కాంచీ నిన్న విడుదలైన పొన్నియిన్ సెల్వం చిత్రంపై దారుణమైన ట్వీట్ వేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆ మూవీని ట్రోల్ చేశాడు.

రచయిత కాంచీ ”మా కొలీగ్ ఒకరు నిన్న పొరపాటున పన్నీరు సెల్వం చిత్రం చూశాను అన్నాడు. పక్కనే ఉన్న తమిళ్ కొలీగ్ 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పరిశీలించిన ఎవరికైనా కాంచీ పొన్నియిన్ సెల్వన్ మూవీని ట్రోల్ చేశారని అర్థం అవుతుంది. నిజంగా ఆ సంఘటన జరిగినా, ఆయన ట్వీట్ చేయాల్సింది కాదు. కాంచీ ఉద్దేశపూర్వకంగా తమిళ ఆడియన్స్ ని గెలికాడు. ఆయనకు అంతగా కాలడానికి కారణం… సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కావచ్చు.
పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో పాటు రికార్డు వసూళ్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి బాహుబలి మా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ముందు నథింగ్ అంటూ తమిళులు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళిని, బాహుబలి చిత్రాలను ట్రోల్ చేయడం, విమర్శించడం చేస్తున్నారు. బాహుబలి 2 ఓపెనింగ్స్ లో పదో వంతు కూడా పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి రాలేదు. అయితే కోలీవుడ్ వరకు మెరుగైన ఫిగర్స్ నమోదు చేసింది. ఆ మాత్రం దానికే వారు ఎగిరెగిరి పడుతున్నారు.
ఈ క్రమంలో అసహనానికి గురైన కాంచీ ఈ ట్వీట్ చేసి ఉండవచ్చు. ప్రస్తుతం కాంచీ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ఎన్ని వివాదాలకు దారితీస్తుందో అన్న చర్చ మొదలైంది. రాజమౌళి గొప్పతనాన్ని ఒప్పుకోలేని తమిళ ఆడియన్స్ తరచుగా ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం చేశారు. పూర్ విజువల్స్, గ్రాఫిక్స్ అంటూ విడుదల రోజూ ట్విట్టర్ లో నెగిటివ్ ప్రచారానికి తెరలేపారు.ఇప్పుడేమో పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎంజాయ్ చేయకుండా, బాహుబలి 2 ని ఆ మూవీ అధిగమించలేదని గ్రహించి, ముందుగానే భుజాలు తడుముకుంటున్నారు.
పొరపాటున నా కొలీగ్ ఒకాయన నిన్న “పన్నీరు సెల్వం” చూశా అన్నారు… పక్కనే ఉన్న తమిళ కొలీగ్ 5వ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం చేసారు… 😬
— ss kanchi శివశ్రీ కాంచి (@kanchi5497) October 1, 2022