Launch Of 5G Services: దేశం మరో సమాచార విప్లవానికి నాంది పలికింది. దేశ టెలికాం రంగంలో మరో కొత్త శకం ఆరంభమైంది. దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం 5 జీ సేవలను జాతికి అంకితం చేశారు. ఢిల్లీ ప్రగతి మైదానంలో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా 5జీ సేవలకు శ్రీకారంచుట్టిన ఆయన అక్కడ ఏర్పాటుచేసి 5జీ ప్రయోగ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. 5జీ సేవల డెమోను రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రధానికి వివరించారు.

దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానుండడంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు మరింత మెరుగయ్యే అవకాశముందని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియాలో తొలుత అభివృద్ది చెందిన 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అక్కడకు కొద్దిరోజుల తరువాత దేశంలో మిగతా ప్రంతాలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికైతే ఢిల్లీ, కోల్ కత్తా, ముంబాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, గాంధీనగర్, చండీఘర్, గురుగ్రామ్, జామ్నగర్, పుణే, లఖ్నవూ నగరాల్లో5జీ సేవలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. అక్టోబరులోనే 5జీ సేవలను ఆ నాలుగు టెలికాం సంస్థలు ప్రారంభించడానికి అన్నిరకాలుగా సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అటు అర్ధికంగా భారత్ పై 5జీ రంగం పై విశేషంగా ప్రభావం చూపే అవకాశముంది. 2035 నాటికి 450 మిలియన్ డాలర్లు (సుమారు రూ.36 లక్షల కోట్లు) చేరొచ్చన్నది ఒక అంచనా. ప్రస్తుతం ఉన్న 4జీతో పోలిస్తే 6నుంచి 7 రెట్లు డేటా వేగం 5జీ సొంతం. దేశంలో మూడు ప్రైవేటు టెలీకాం కంపెనీలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్ప్రెక్టమ్ ను కొనుగోలుచేసినట్టు సమాచారం. ఇందులో జియో సంస్థ రూ.88 వేల కోట్లు, ఎయిర్ టెల్ రూ.43 వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.19 వేల కోట్ల స్ప్రెక్ట్రమ్ ను కొనుగోలుచేసినట్టు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కొద్ది నెలలు ఆగితే టెలికం రంంలో విప్లవాత్మక మార్పులు దేశంలోప్రభావమున్న మాట మాత్రం వాస్తవం.
[…] Also Read:Launch Of 5G Services: దేశంలో మరో విప్లవం.. 5జీ సేవలు … […]