‘ఆర్ఆర్ఆర్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ అనుకుంటుందట. ఇక […]

Written By: admin, Updated On : January 1, 2021 4:54 pm
Follow us on


నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ అనుకుంటుందట. ఇక ఆర్ఆర్ఆర్… అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్.

Also Read: వీరత్వాన్ని మేల్కొలపాలంటున్న పవన్.. !

అందుకే ఈ సినిమా నుండి అప్ డేట్ వస్తోందంటే.. నెటిజన్ల ఆనందానికి అవధలు లేకుండా పోతున్నాయి. ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఫ్యాన్స్ కు టీజర్ తో ఓ రేంజ్ సర్ ప్రైజ్ ఇవ్వడానికి జక్కన్న గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. అసలు ఉన్నట్లు ఉండి ఇంత సడెన్ గా టీజర్ ను రిలీజ్ చేయాలనుకోవడానికి కారణం వేరే ఉందట. ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైయ్యాయి.

Also Read: ఎన్టీఆర్ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్.. !

అయితే, నార్త్ లో ఎన్టీఆర్ టీజర్ కి వచ్చిన స్పందనలో ఎన్టీఆర్ లుక్స్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని.. అందుకే నార్త్ లో కూడా ఈ సారి ఫుల్ క్రేజ్ ను తెచ్చుకోవడానికి రాజమౌళి టీజర్ ను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, ఆంధ్ర ప్రాంతానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీకి డి.వి.వి.దానయ్య నిర్మాత.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్