RRR Movie: బాహుబలి లాంటి ట్రెండ్ సెట్టర్ తెరకెక్కించిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా… దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఈరోజు మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

అయితే ఇప్పుడు తాజాగా ఎవరు ఊహించని రీతిలో ఇదిలా ఉంటే.. ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది ఆర్ఆర్ఆర్ మూవీ. దేశంలోనే మొదటిసారిగా అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్ సిస్టం కలిగిన పీవీఆర్ సంస్థతో… ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ డీల్ కుదుర్చుకుంది. పీవీఆర్ సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరును.. పీవీఆర్ఆర్‌ఆర్ గా మార్పు చేశారు. సినిమా ఇండస్ట్రి చరిత్రలోనే ఇదొక రికార్డు అని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.
#PVRRR https://t.co/Wo78TCkeKx
— RRR Movie (@RRRMovie) October 29, 2021
కాగా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అటు చరణ్, తారక్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.