https://oktelugu.com/

RajiniKanth: రజినీకాంత్ ఆరోగ్యం విషమించిందా? మళ్లీ ఏమైంది?

RajiniKanth:సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యపరిస్థితి మళ్లీ విషమించినట్టు తెలిసింది. ఇటీవల దేశంలోనే ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అతిరథ మహారథుల సమక్షంలో అందుకున్న రజినీకాంత్ ఆ తర్వాత ప్రధాని మోడీ ఇతరులను కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రి నుంచి వస్తున్న లీకుల ప్రకారం రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని కథనాలు వస్తున్నాయి. రోటీన్ హెల్త్ చెకప్ అని కుటుంబ సభ్యులు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2021 / 01:19 PM IST
    Follow us on

    RajiniKanth:సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యపరిస్థితి మళ్లీ విషమించినట్టు తెలిసింది. ఇటీవల దేశంలోనే ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అతిరథ మహారథుల సమక్షంలో అందుకున్న రజినీకాంత్ ఆ తర్వాత ప్రధాని మోడీ ఇతరులను కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

    Rajinikanth

    ఆస్పత్రి నుంచి వస్తున్న లీకుల ప్రకారం రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని కథనాలు వస్తున్నాయి. రోటీన్ హెల్త్ చెకప్ అని కుటుంబ సభ్యులు చెబుతున్నా రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతిందని అంటున్నారు.

    ఇప్పటికే గత కరోనా సమయంలో రజీనీకాంత్ వైరస్ బారిన పడి సీరియస్ అయ్యారు. పైగా ఆయనకు ఇప్పటికే కిడ్నీల ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఆ సమస్య తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో సమస్య ఉందని తేలిందట.. నాళాలు దెబ్బతిన్నాయని..చికిత్స అవసరమని తేల్చారని ప్రచారం సాగుతోంది.

    ఇప్పటికే రజినీకాంత్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్తోపాటు విదేశాల్లో చికిత్స తీసుకున్నారు. ఆయన అవయవాలు సరిగ్గా పనిచేయడం లేదని అంటున్నారు. అనారోగ్యం తరచూ పడుతుండడంతో పార్టీ పెట్టాలన్న ఆలోచన మాని రాజకీయాలకు కూడా దూరం అయ్యారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే మరోసారి అనారోగ్యం బారినపడడం ఈసారి గుండె నాళాల సమస్య అనడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.