దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళిని ‘ఆర్ఆర్ఆర్’ను తెరక్కిస్తుండటంతో ఈ సినిమాపై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్లో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాపై కరోనా ఎఫెక్ట్ తోపాటు కొత్త వివాదాలు రావడం చిత్రయూనిట్ కు సమస్యగా మారింది.
Also Read: ఎన్టీఆర్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !
ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతున్నారు. ఇప్పటికే చరణ్.. ఎన్టీఆర్ టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. చరణ్ టీజర్ పై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా ఎన్టీఆర్ టీజర్ పై రెస్పాన్స్ తోపాటు వివాదాలు కూడా వచ్చాయి.
‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లో కొమురంభీంను చివర్లో ఓ మతానికి చెందిన టోపీతో చూపించడం దుమారం రేపుతోంది. తొలుత ఈ విషయంలో కొమురంభీం వారసులు స్పందించారు. ఆ తర్వాత ఇదికాస్తా రాజకీయ రంగుపులుముకుంది. ఇప్పటికే ఆదివాసీ సంఘాలతోపాటు బీజేపీ ఎంపీ సోయం బాపురావు రంగంలోకి దిగి దర్శకుడు రాజమౌళిని వార్నింగ్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం రాజమౌళికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కొమురంభీం చరిత్రను వక్రీకరించేలా.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చూపించడాన్ని తప్పుబట్టారు. ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తే బరిశెలతో తరిమికొడుతాం అంటూ హెచ్చరించారు. ఈ విషయం రోజురోజుకు రాజకీయంగా దుమారం రేపుతుండటంతో చిత్రయూనిట్ కు సమస్యగా మారుతోంది.
Also Read: తగ్గనంటున్న రాజమౌళి.. స్టార్ హీరోల అభిమానుల్లో టెన్షన్..?
భారీ బడ్జెట్లో తెరకెక్కతున్న ‘ఆర్ఆర్ఆర్’కు ఇలాంటి వివాదాల వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. జక్కన్న మాత్రం ‘కట్టప్ప బాహుబలి’ని ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్ మాదిరిగానే ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉంటున్నాడు. ఇది రోజుకురోజుకు రాజకీయంగా దుమారం రేపుతుండటంతో రాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది. దీంతో రాజమౌళి ఏం చెబుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్