RRR Re-Release In USA: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బాక్స్ ఆఫీస్ తూఫాన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మన తెలుగు సినిమా సత్తా ని బాహుబలి సినిమా తర్వాత ప్రపంచం నలుమూలలకు మరోసారి విస్తరింప చేసేలా చేసాడు రాజమౌళి ఈ సినిమాతో..#RRR సినిమాతో అయితే బాహుబలి కి కూడా చూడని ఎన్నో అద్భుతాలు చూసినట్టు అయ్యింది..ఎందుకంటే బాహుబలి సినిమాని కేవలం ఇండియన్స్ మాత్రమే విపరీతంగా ఇష్టపడ్డారు..కానీ #RRR కి కేవలం ఇండియన్ మాత్రమే కాదు, ఇతర దేశాలకు చెందిన వారు కూడా విపరీతంగా ఇష్టపడుతున్నారు..థియేటర్స్ లో సెన్సషనల్ బాక్స్ ఆఫీస్ రన్ ని దక్కించుకున్న ఈ సినిమా ని ఇటీవలే OTT లో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..థియేటర్స్ లో కంటే OTT లో విడుదల అయినప్పుడు ఈ సినిమాకి విదేశాల్లో ఉండే ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ లభించింది..జీ 5 లో తెలుగు , తమిళం, కన్నడ మరియు మలయాళం బాషలలో విడుదల అయినా ఈ సినిమా,నెట్ ఫ్లిక్స్ లో హిందీ లో విడుదల అయ్యింది.
నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయినా హిందీ వెర్షన్ కి ఇతర దేశాల ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ స్థాయి ఆదరణ బాహుబలి సిరీస్ కి కూడా దక్కలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు..సుమారు 63 దేశాలలో ట్రేండింగ్ అవుతున్న ఈ సినిమా..20 దేశాలలో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది..కేవలం నెట్ ఫ్లిక్స్ నుండే ఈ సినిమాకి 18 మిల్లియన్లకు పైగా వాచ్ హవర్స్ ని దక్కించుకుంది..ఇంగ్లీష్ సినిమాలకు కాకుండా నెట్ ఫ్లిక్స్ లో ఒక్క ప్రాంతీయ బాషా చిత్రానికి ఈ స్థాయి వ్యూస్ ఆదరణ దక్కడం ఇదే తొలిసారి అని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది..విదేశాల్లో ఉండే ఆడియన్స్ నుండి వస్తున్నా రెస్పాన్ ని చూసి ఆ క్రేజ్ ని కాష్ చేసుకునేందుకు #RRR మూవీ టీం అన్ ఎడిటెడ్ వెర్షన్ ని #encoRRR పేరుతో మళ్ళీ రీ రిలీజ్ చేసింది..రీ రిలీజ్ లోను ఈ సినిమా అక్కడ కాసుల కనక వర్షం కురిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..తోలి సారి ఒక్క తెలుగు సినిమాకి తెలుగు ఆడియెన్స్ కాకుండా హాలీవుడ్ ఆడియన్స్ తో థియేటర్స్ నిండిపోవడం చూసి #RRR మూవీ టీం సైతం ఆశ్చర్యపోయారు.
Also Read: Lokesh Kanagaraj- Prabhas: ఆ దర్శకులకున్న టాలెంట్ కూడా కనకరాజ్ కి లేదా ప్రభాస్?
రీ రిలీజ్ లో ఈ సినిమా అక్కడ దాదాపుగా లక్ష డాలర్స్ కి పైగానే కలెక్షన్స్ ని వసూలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇది ఒక్క సెన్సషనల్ రికార్డుగా మనం చెప్పుకోవచ్చు..ఈ సినిమాని చూసిన తర్వాత విదేశీయులు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కనబర్చిన నటనని ప్రశంసలతో ముంచేస్తున్నారు..ఈ ఇద్దరి హీరోల పాత సినిమాల వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఇఅలంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని మేము ఇప్పటి వరుకు చూడలేదు అంటూ సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..ఇది ఇలా ఉండగా విదేశాల్లో వస్తున్నా అదరణని గమనించిన #RRR మూవీ టీం..ఈ సినిమాని చైనా, జపాన్ భాషల్లో దబ్ చేసి వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు..ముఖ్యంగా చైనా బాక్స్ ఆఫీస్ ఇండియా కి చాలా పెద్దది అనే విషయం మన అందరికి తెలిసిందే..అమిర్ ఖాన్ నటించిన దంగల్ మరియు సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు అక్కడ ప్రభంజనం సృష్టించాయి..ఇప్పుడు #RRR కూడా అదే స్థాయిలో ప్రభంజనం సృష్టించడం ఖాయం అని మేకర్స్ గట్టిగ నమ్ముతున్నారు..మరి వారి నమ్మకాలను ఈ సినిమా ఎంత వరుకు నిలబెడుతుందో చూడాలి.
Also Read: Modi Visit to Hyderabad: మోడీ మళ్లీ హైదరాబాద్ పర్యటన.. అందుకేనా?
Recomended Videos