Telangana Formation Day: కాంగ్రెస్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ.. సుధీర్ఘ కాలం దేశాన్ని, వివిధ రాష్ట్రాలను పాలించింది. సమర్థత, పాలన, రాజకీయ అనుభవం ఉన్న ఎంతో మంది నాయకులు ఆ పార్టీ సొంతం. దేశ ప్రజల కోసం అనేక చట్టాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ సొంత. కానీ దశాబ్దకాలంగా పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారు. కానీ దశాబ్దకాలంగా పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఉద్యమ ఆకాంక్షను నెరవేచ్చింది కూడా కాంగ్రెస్సే. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడగొడితే ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోతామని తెలిసినా యూపీఏ చైర్మన్‌గా ఉన్న సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర ్పటుకే మొగ్గు చూపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారు.
రెంటికి చెడ్డ రేవడిలా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో ఒక రాష్ట్రంలో నష్టపోయినా.. మరో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని 2014 ముందు కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌పై ఆంగ్రంతో ఉన్న ఆంధ్రా ప్రజలు ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బకొట్టారు. ఒక్క సీటులో కూడా ఆ పార్టీని గెలిపించలేదు.
Also Read: KCR- Rythu Bandhu: రైతుబంధుపై కేసీఆర్ షాకింగ్ నిర్ణయం?
ఇది కాంగ్రెస్ ముందే ఊహించినప్పటికీ మరీ ఇంత దారుణంగా ఉంటుందని అంచనా వేయలేదు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ బలపడడం కూడా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ అధిష్టానం భావించింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్, రాష్ట్ర విభజన తర్వాత మొండిచేయి చూపారు. దీంతో ఒంటరిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల్లో తెలంగాణ ప్రజలు ఉద్యమ సారథి అయిన కేసీఆర్ సారథ్యంలోని పార్టీవైపే మొగ్గు చూపారు. రాష్ట్రం సాధించిన పార్టీకి అధికారం ఇస్తే ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని తెలంగాణ ఓటర్లు భావించారు. కొంతమంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా చివరకు గులాబీ పార్టీనే విజయం వరించింది. ముఖ్యమంతి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేరుకున్నారు. తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని భావించారు.
2018లోనూ తప్పని పరాభవం..
మొదటి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ పూర్తి ఐదేళ్లు పాలించకుండానే 9 నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2018లో జరిగిన ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఇది ఆ రెండు పార్టీలకంటే అధికార టీఆర్‌ఎస్‌కే లాభం చేసింది. గులాభీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చడంలో సఫలమయ్యారు. చంద్రబాబు వస్తే మళ్లీ తెలంగాణలో ఆంధ్రా పాలన వస్తుందని, ఆంధ్రులు తెలంగాణపై మళ్లీ పెత్తనం చేస్తారనే నినాదాన్ని బలంగా ప్రజల్లో ఇతీసుకెళ్లారు. నాటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఓటర్లు ఆంధ్రపెత్తనం మస్లే తెలంగాణ మళ్లీ ఆగమవుతుందని భావించారు. దీంతో కాంగ్రెస్, టీడీపీలను కాదని, టీఆర్‌ఎస్ పార్టీనే మళ్లీ పట్టం కట్టారు. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే ఆ ఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవని రాజకీవ విశ్లేషకుల అంచనా వేశారు. మరోవైపు టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది కూడా టీఆర్‌ఎస్‌వైపు ఓటర్లను మొగ్గు చూపేలా చేసింది. ఫలితంగా 2014 నాటి ఎన్నికలతో పోల్చితే మరిన్ని ఎక్కువ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించి.
తాజాగా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు..
దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు ఇప్పటికీ కనువిప్పు కలుగడం లేదు. అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నాయి. 2018లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో బాగున్నా.. ప్రజల్లో విశ్వాసం నింపలేదు. తాజాగా ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కానీ దీనిని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వేసే ఎత్తుగడలను ఎంతవరకు చిత్తు చేయగలుగుతారు, ప్రజల్లో ఏమేరకు కాంగ్రెస్‌పై విశ్వాసం పెంచుతారు అనే అంశాలపైనే వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపు ఆధారపడి ఉంటుంది.
Also Read:CM KCR- Nikhat Zareen- Esha Singh: కేసీఆర్ సార్.. ఇంత ఆర్థిక దుస్థితిలో వారికి రెండు కోట్లా?