https://oktelugu.com/

RRR: అనుకున్నదే అయ్యింది… రాజమౌళి పక్షపాతం చూపించాడుగా !

RRR:  ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మూడు నిమిషాల ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. ఉద్యమ వీరుల సాహస పోరాటంతో పాటు ఆడియన్స్ ని ప్రయాణం చేయించింది. యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా సాగిన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ నభూతో నభవిష్యతి అన్న మాట వినిపిస్తుంది. అలాగే ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ద్వారా రాజమౌళి కథ కూడా చెప్పేశాడు. ఒకప్పటి మిత్రులైన అల్లూరి, కొమరం […]

Written By:
  • Shiva
  • , Updated On : December 10, 2021 / 10:45 AM IST
    Follow us on

    RRR:  ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మూడు నిమిషాల ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. ఉద్యమ వీరుల సాహస పోరాటంతో పాటు ఆడియన్స్ ని ప్రయాణం చేయించింది. యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా సాగిన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ నభూతో నభవిష్యతి అన్న మాట వినిపిస్తుంది. అలాగే ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ద్వారా రాజమౌళి కథ కూడా చెప్పేశాడు.

    RRR

    ఒకప్పటి మిత్రులైన అల్లూరి, కొమరం భీమ్ మధ్య కొన్ని పరిస్థితులు ఘర్షణకు దారితీశాయి. బ్రిటీష్ ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేస్తున్న రామ్ వాళ్లకు విధేయుడిగా, ప్రభుత్వానికి, దొరలకు కాపలాదారుగా ఉంటారు. వాళ్ళ అకృత్యాలను ఎదిరించే రెబల్ గా కొమరం భీమ్ బ్రిటీష్ దొరలకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు. ప్రభుత్వ విధేయుడైన రామ్, వ్యతిరేకి అయిన భీమ్ మధ్య సంఘర్షణ చోటు చేసుకుంటుంది.

    కొన్ని సంఘటనల అనంతరం రామ్ లో పరివర్తన వస్తుంది. భీమ్ తో చేతులు కలిపి బ్రిటీష్ దొరల అంతానికి సమర శంఖం ఊదుతాడు. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ కథ చెప్పాలంటే ఇది. మనం నిశితంగా పరిశీలిస్తే రాజమౌళి ఊహించినట్లే పక్షపాతం చూపించాడు. కథ విషయంలో ఆయన ఎన్టీఆర్ ని ప్రధాన హీరోగా చేశాడు. పరిశ్రమలో ఎన్టీఆర్ రాజమౌళికి అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ కలిసి కెరీర్ నిర్మించుకున్నారు.

    Also Read: Manchu Vishnu: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా… మంచు విష్ణు

    ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎక్కువ ప్రాధాన్యత చరణ్ కంటే, ఎన్టీఆర్ కే రాజమౌళి ఇస్తాడని పుకార్లు వినిపించాయి. ట్రైలర్ ద్వారా అది నిజమే అని నిరూపితమైంది. బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగిగా రామ్ చరణ్ దేశ ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు ఆయన క్యారెక్టర్ ఉంది. ఆ ప్రభుత్వ విధేయుడిగా చరణ్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంది.

    ఎన్టీఆర్ చేస్తున్న భీమ్ పాత్రను మాత్రం మొదటి నుండి పాజిటివ్ షేడ్స్ తో గోండు జాతి వీరుడిగా చూపించారు. యాక్షన్, ఎలివేషన్స్ లో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్నప్పటికీ కథ విషయంలో ఎన్టీఆర్ కి లీడ్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తుంది.

    Also Read: RRR Movie: రికార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​

    Tags