https://oktelugu.com/

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా … కారణం ఏదైనా ఉందా

RRR Movie: సాధారణంగా ప్రతి సినిమా మీద ట్రోల్స్ రావడం కామన్. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల అయిన తర్వాత దానిపై వస్తున్న ట్రోలింగ్‌లో ఓ విషయంలో పాయింట్ ఉంది. కొంత మంది యాక్షన్ సన్నివేశాల్లో లాజిక్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే… బ్రిడ్జ్ మీద నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరోవైపు నుంచి దూకే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ ని ఒకసారి నిశితంగా పరిశీలించండి. బ్రిడ్జ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 10:46 AM IST
    Follow us on

    RRR Movie: సాధారణంగా ప్రతి సినిమా మీద ట్రోల్స్ రావడం కామన్. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల అయిన తర్వాత దానిపై వస్తున్న ట్రోలింగ్‌లో ఓ విషయంలో పాయింట్ ఉంది. కొంత మంది యాక్షన్ సన్నివేశాల్లో లాజిక్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే… బ్రిడ్జ్ మీద నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరోవైపు నుంచి దూకే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ ని ఒకసారి నిశితంగా పరిశీలించండి. బ్రిడ్జ్ మీద నుంచి కిందకు దూకిన సమయంలో రామ్ చరణ్ చేతిలో జెండా ఉంటుంది. ఆ తర్వాత షాట్ చూస్తే జెండా ఎన్టీఆర్ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరూ చేతులు కలుపుతారు. చేతులు కలపడానికి ముందే చరణ్ చేతిలో జెండా ఎన్టీఆర్ చేతికి ఎలా వచ్చింది ? రాజమౌళి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అంటూ ట్రోల్ చేస్తున్నారు. లేదంటే ఆ షాట్స్ వెనుక సినిమాలో ఏదైనా వివరణ ఉంటుందో తెలుసుకోవాలంటే జనవరి 12 వరకు వేచి చూడక తప్పదు.

    RRR Movie

    మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా… ప్రపంచ వ్యాప్తంగా అంద‌రూ ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా.. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తారక్ జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుకు శరవేగంగా జరుపుకుంటుంది.

    Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ పై స్పందించిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు…

    RRR Movie

    RRR Movie

    Also Read: ఎన్టీఆర్ మొదటి అడుగు పడింది