Tollywood Movies: రాజమౌళి పుణ్యమా అని ఇప్పుడు సినిమా అంటే.. విజువల్ మీడియా అయిపోయింది. ఒకప్పుడు సినిమా కథలు ఎక్కువగా డైలాగ్స్ మీద నడిచేవి. కానీ, ఇప్పుడు భౌగోళిక ప్రదేశాల అందాల పై నడుస్తున్నాయి. అంటే.. పెద్ద పెద్ద మంచు పర్వతాలు, వాటి పక్కనే అతి పెద్ద జలపాతాలు, వాటి కింద సాధారణ భూములు వంటి అద్భుత విజువల్స్ పై నడుస్తున్నాయి. భారీ సినిమాలకు ఇవి కనీస అవసరాలు అయిపోయాయి.

మరి, ఈ గొప్ప లొకేషన్స్ అసలు నిజ ప్రపంచంలో ఉండే వీలుందా ? ఉంటే, అవి ఎక్కడ ఉన్నాయి ? రాజమౌళి లాంటి దర్శకులు వాటిని ఎక్కడ పట్టుకుంటారు ? ఎలా కనిపెడతారు ? లాంటి ప్రశ్నల పై సినిమా పక్షుల గ్రూప్స్ లో ఓ చర్చ జరిగింది. సినిమాలలో చూపించినంత అందంగా పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఉండవు.
ఉండకపోగా అవి భయపెడతాయి. ఇక పెద్ద పెద్ద జలపాతాలు చూడడానికి బాగుంటాయి. కానీ హీరోలు వాటిల్లో దూకి హీరోయిజమ్ చూపించే విధంగా అవి ఉండవు. ఒకసారి ఆ జలపాతాల్లో దూకితే.. మళ్ళీ ఎక్కడ తేలతామో కూడా ఊహించలేనంత భయాన్ని కోల్పోతాయి అవి. అందుకే, వాస్తవ ప్రపంచంలో ఈ అందమైన భౌగోళిక ప్రదేశాలు ఉండే అవకాశం తక్కువ.
Also Read: ‘కఠారి కృష్ణ’ మెప్పించాడా.. మూవీ రివ్యూ
చూడటానికి అందంగా ఉన్నా.. అవి కేవలం ఆస్వాదించడానికే, అనుభవించడానికి పనికిరావు. అందుకే, గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సినిమా అనేది ఒక అందమైన ఊహ! ఆ ఊహ సైన్స్ కాదు కాబట్టి, ఆ ప్రాంతాలు ఎలా విజువల్ చేసుకున్నారో అవి లాజికల్ గా ఉండాల్సిన పని లేదు.
ఇక సినిమాల్లో చూపించినట్లు ఎత్తుయైన మంచు కొండల మధ్య ఒక ఎడారిలా పల్లంగా ఉండి, అక్కడ నుండి జలపాతం మొదలవుతూ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం. సినిమాల్లో చూపించినట్టు నిజ ప్రపంచంలో ఇన్ని భౌగోళిక వైరుద్యాలు ఒక్కే చోట ఉండవు. సినిమాలోని లొకేషన్స్ కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే కనిపిస్తాయి.
Also Read: టాలీవుడ్లో మల్లూ హీరోయిన్ల హడావిడి.. స్టార్ హీరోల సరసన ఛాన్స్