RRR Pre Release Event in Dubai: దుబాయ్ లో గ్రాండ్ గా ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్

RRR Pre Release Event in Dubai: గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమం అక్కడే ఘనంగా జరపాలని, హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ […]

Written By: Raghava Rao Gara, Updated On : February 24, 2022 5:02 pm
Follow us on

RRR Pre Release Event in Dubai: గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

RRR

అయితే ఇప్పుడు ఆ కార్యక్రమం అక్కడే ఘనంగా జరపాలని, హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ను ముఖ్య అతిథిగా పిలవాలని చిత్రబృందం భావిస్తోందట. మార్చి 1న ఈ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్నట్టు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్‌లో మరో మైలు రాయి దాటింది.

Also Read:  ఎన్టీఆర్ కోసం 4 కోట్లు తీసుకున్న అలియా భట్

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 16 కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక 16 కోట్ల వ్యూస్ అంటే.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక రికార్డ్. ఇక ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతైనా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

RRR

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని అన్ని ముఖ్యమైన భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. పైగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అందుకే హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కోసం పడిగాపులు కాస్తున్నారు. కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్నాడు.

Also Read: మోడీది ఏం తప్పులేదా? ఆ రెండు పత్రికలదే తప్పా?

 

Tags