Chanakya Nithi: మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సమస్యలు మనం చేసిన పొరపాట్లు లేదా తప్పుల వల్ల సృష్టించబడితే మరికొన్ని సమస్యలు మాత్రం ఊహించని కారణాల వల్ల ఎదురవుతూ ఉంటాయని చెప్పవచ్చు. చాణక్యుడికి అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉంది. చాణక్యుడి సూచనలను పాటించడం వల్ల మనం నిత్య జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఇతరులకు దానం చేస్తే మంచిదని చెప్పవచ్చు. సంపాదనే లక్ష్యంగా ఉంటూ దానం చేయడం మానేస్తే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. మంచి పనులు, గొప్ప పనులు చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమించే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయవద్దని చాణక్యుడు సూచనలు చేశారు.
ప్రియమైన వారి విషయంలో ఎల్లప్పుడూ విధేయతతో వ్యవహరించాలి. ఆపదలో ఉన్న సమయంలో సొంత వ్యక్తులు మాత్రమే ఆదుకుంటారని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని భావించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.