Radhe Shyam Song Promo: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాటలు బాగా ఆకట్టుకోగా, యువన్ శంకర్ రాజా పాడిన ఈ రాతలే సూపర్ హిట్ అయింది. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని వదిలారు. చేతిలో చేపని పట్టుకొని పూజా వస్తుంటే, ప్రభాస్ ఆమెని చూసి ఫీలయ్యే ప్రోమో చాలా క్యూట్ గా అనిపిస్తుంది.
ఇలాంటి మోమెంట్స్ తో రేపు మ. 12. గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నారు. మొత్తమ్మీద ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ – పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. పూజా కూడా చాలా అందంగా కనిపించింది. ఇక పరమహంస పాత్రలో కృష్ణంరాజు మెరిసారు. అన్నట్టు బాలీవుడ్ బిగ్ బి రాధేశ్యామ్ కు వాయిస్ ఓవర్ అందించారు.
Also Read: దుబాయ్ లో గ్రాండ్ గా ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్
కాగా హృద్యమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రానికి అమితాబ్ నేపథ్యగళం చక్కటి అలంకారంగా భాసిల్లనుంది. బిగ్ బి హిందీ వెర్షన్ కి వాయిస్ ఓవర్ ఇస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు వెర్షన్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. అమితాబ్ వాయిస్ పై ఆనందం వ్యక్తం చేసిన దర్శకనిర్మాతలు.. మహేష్ వాయిస్ గురించి మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇక ‘రాధేశ్యామ్’ కథ.. ఓ రియల్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. సినిమా ఓపెనింగ్ లోనే.. ఓ ట్రైన్ 106 మంది ప్యాసింజర్లతో రోమ్ కి బయలుదేరుతుంది. అయితే, అ ట్రైన్ ఓ టన్నేలోకి వెళ్లి తిరిగి బయటకు రాదు. అసలు ఆ ట్రైన్ ఏమైపోయింది ? అందులోని ప్యాసింజర్లు ఏమయ్యారు ? అనే మిస్టరీతో సినిమాలో టెన్షన్ మొదలవుతుంది.
కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read: రోజురోజుకు రేంజ్ ను పెంచుకుంటున్న ‘కృతి శెట్టి’
Recommended Video: