RRR vs F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తున్న “ఎఫ్ 3” సినిమా రిలీజ్ కి అసలు టైమ్ కలిసి రావడం లేదు. మొదట ‘ఎఫ్ 3’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ విడుదల ఉండటంతో.. ఎఫ్ 3ను ఫిబ్రవరి 25 కు మార్చారు. ఆ తర్వాత ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కి సిద్ధం అయింది. దాంతో ‘ఎఫ్ 3’ను మళ్ళీ ఏప్రిల్ 28కి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై కొత్త అప్ డేట్ !
అయితే, తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ 28న విడుదల కావచ్చని ఆ చిత్ర యూనిట్ ప్రకటించడంతో ఇప్పుడు ‘ఎఫ్ 3’ మళ్ళీ పోస్ట్ ఫోన్ అవ్వడం ఖాయం అంటున్నారు. మొత్తమ్మీద మరోసారి తన సినిమా వాయిదా పడుతుందనే ఊహాగానాలు తనకు కూడా వస్తున్నాయని అనిల్ రావిపూడినే హింట్ ఇస్తున్నాడు. మొత్తానికి ‘ఎఫ్ 3’ సినిమాని జెడ్ స్పీడ్ తో పూర్తి చేసినా రిలీజ్ మాత్రం చేయలేకపోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి మూడేళ్లు సమయం పెట్టాడు. ఈ సారి పక్కా ప్లాన్ తో హిట్ కొడతాడనే కసితో ఉన్నాడు అనిల్. నిజానికి కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉండి ఉంటే.. ఎఫ్ 3 సినిమా ఎప్పుడో రిలీజ్ కూడా అయి ఉండేది. కానీ, కరోనా సెకండ్ వేవ్ మొత్తం తారుమారు చేసింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫ్ 3 రిలీజ్ ను అడ్డుకుంటూ వస్తోంది. మొత్తానికి ఎఫ్ 3 మళ్లీ వాయిదా పడబోతుంది.
[…] […]