Radhe Shyam Romantic Song: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ విడుదలకు ఎప్పుడో సిద్ధమైంది. అయితే, కరోనాతో వాయిదా పడ్డ ఈ ‘రాధేశ్యామ్’ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజా హెగ్డే లేకుండానే వారిద్దరి మధ్య చిత్ర యూనిట్ ఓ రొమాంటిక్ సాంగ్ తెరకెక్కించింది. సాంగ్ షూటింగ్ టైమ్‌కు పూజ ఇతర సినిమాలతో బిజీ అయి డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయిందట. దీంతో గ్రాఫిక్స్ ద్వారా ఈ సాంగ్ పూర్తి చేశారని.. ఈ రొమాంటిక్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తోందని తెలుస్తోంది.

Also Read: ప్రభాస్ ఖాతాలో మరో ఘనత.. ‘రాధే శ్యామ్’ ట్రైలర్ కి కొత్త రికార్డు !
అయితే, ప్రభాస్-పూజా లేకుండానే వారి మధ్య రొమాంటిక్ సాంగ్ ఎలా తీశారు ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా కామెంట్స్ చేస్తున్నారు. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ అద్భుతాలు చేయవచ్చు అని సినిమా వాళ్ళు నిరూపిస్తున్నారు. ఇక ‘రాధేశ్యామ్’ విషయంలో యువీ క్రియేషన్స్ తెలివిగా ముందుకు వెళ్తుంది. ప్రమోషన్స్ దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ ఎక్కడా అంచనాలు భారీ స్థాయిలో పెరగకుండా చూసుకుంటూ.. సినిమా గురించి ఇలా ఇంట్రెస్టింగ్ ఫీడ్ బ్యాక్ లను జనంలోకి వదులుతున్నారు.
నిజానికి సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని.. ముఖ్యంగా భూకంపం, సునామీ తాలూకు విజువల్స్ అద్భుతంగా ఉంటాయని.. మొత్తానికి హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరి ఆ కళ్ళు చెదిరే యాక్షన్స్, అబ్బుర పరిచే విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. అయితే, సినిమా పై విపరీతమైన అంచనాలు పెరగకుండా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ” రాధే శ్యామ్ ” కొత్త రిలీజ్ డేట్ ఇదేనా ?
[…] Also Read: ప్రభాస్-పూజా లేకుండానే రొమాన్స్.. ఆ సా… […]