‘RRR’ release date out : నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా మొత్తానికి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధం అయింది. కరోనా థర్డ్ వేవ్ తో వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కొత్త విడుదల తేదీతో చిత్ర బృందం కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.
‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే.. మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న మా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అంటూ చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో క్లారిటీ ఇచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్.. అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రాకపోవచ్చు.

NTR
ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో నెటిజన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

RRR
పైగా ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, మరియు ట్రైలర్ అండ్ సాంగ్స్ విడుదలైయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతుంది ఈ ప్యాన్ ఇండియా మూవీ.