చైనాలోని వూహన్‌లో గతేడాది నవంబర్‌లో కరోనా వైరస్ ప్రారంభమైంది. మన దేశంలో ఈ సంవత్సరం మార్చిలో ఎంట్రి ఇచ్చి ఆ తరువాత దేశమొత్వం వ్యాపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాజిటివ్ కేసుల్లో టాప్‌టెన్‌లో ఉంది. రోజుకు రెండు నుంచి మూడు వేల వరకు కేసులు నమోదవుతుండడంతో ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. కరోనా ప్రారంభంలో మూతబడ్డ విద్యాసంస్థలను ఆన్‌లాక్ గైడ్‌లైన్స్ ద్వారా తెరుచుకోవచ్చని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా నవంబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు, కళాశాలలను తెరవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా గురువారం ప్రకటించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
రాష్ట్రంలో పాఠశాలలు తెరిస్తే ఎంతమంది తల్లిదండ్రులు తమ విద్యార్థులను పంపిస్తారోననే ప్రశ్న ఉత్ఫన్నమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తొలిగిపోనందును తమ పిల్లలను పాఠశాలలకు ఎలా పంపాలి..? అని అనుకుంటున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. కొందరు తల్లిదండ్రులు, విద్యాసంస్థల మధ్య తగాదాలు మొదలవడంతో పాఠశాలలు తెరువక తప్పడం లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: చంద్రబాబు వేసే పెద్ద స్కెచ్ అదేనా..?
ఇటీవల ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గవండ్లపాలెం, ముండ్లమూరు మండలం మారెళ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆన్‌లైన్ పాఠాలపై సందేహాల నివృత్తి కోసం వచ్చిన 9-10 తరగతుల విద్యార్థుల్లో 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఇటు విజయనగరం జిల్లా గంట్యాడ ఉన్నత పాఠశాలలో 20 మంది వైరస్ బారిన పడ్డారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం యూపీ స్కూల్ హెడ్మాస్టర్‌కు, రాజుపాలెం మండలం గణపవరం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది.
Also Read: టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీలో మంత్రి పదవా?
అయితే 22 రాష్ట్రాల్లో అన్‌లైన్ పద్దతిలోనే తరగతుల నిర్వహిస్తున్నారని రాష్ట్రంలో ఇప్పుడు బడులు తెరవాల్సిన అవసరం ఏముందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా సాకు చెప్పి బడులకు మాత్రం కరోనా ఉండదా..? అని ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లలు భౌతిక దూరం పాటిస్తూ గంటల కొద్దీ మాస్కులు పెట్టుకొని ఉండలేరని, ప్రత్యామ్నాయం ఆలోచించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.