https://oktelugu.com/

Pushpa: పుష్ప టీమ్​కు ఆర్​ఆర్​ఆర్​ యూనిట్​ స్పెషల్​ విషెస్​.. తగ్గేదెలే అంటూ ట్వీట్​

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప – ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. https://twitter.com/RRRMovie/status/1471674504136953857?s=20 ఇంతకాలం స్టైలిష్ పాత్రల్లో కనిపించిన అల్లు అర్జున్ ఓ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 01:00 PM IST
    Follow us on

    Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప – ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

    Pushpa

    https://twitter.com/RRRMovie/status/1471674504136953857?s=20

    ఇంతకాలం స్టైలిష్ పాత్రల్లో కనిపించిన అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్ర చేయడం, రష్మిక కంప్లీట్ డీ గ్లామర్ రోల్ చేయడం ప్రాజెక్ట్‌పై అంచనాలు మరో స్థాయికి తీసుకు వచ్చాయి. ఇక సుకుమార్ – అల్లు అర్జున్ – మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గాను ‘పుష్ప: ది రైజ్’ నిలిచింది.

    Also Read: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?

    ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు పుష్ప టీమ్​తో పాటు బన్నీకి స్పెషల్ విషెష్​ తెలుపుతున్నారు.  ఇటీవలే రామ్​చరణ్​, మెగాస్టార్​ చిరంజీవి తదితరులు శుభాకాంక్షలు తెలపగా.. తాజాగా ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ ఎనర్జిటిక్​ విషెష్ తెలిపారు. బ్లాక్​ బాస్టర్ సక్సెస్ అందుకున్నందుకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్​ చేసారు. థయేటర్​లో ప్రేక్షకులు మాస్​ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు తగ్గేదేలే అంటూ బన్నీకి ఊపందించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట వైరల్ అవుతోంది.  ఇప్పటికే ఈ సినిన చూసిన సినీ ప్రముఖులందరూ దర్శకుడు సుకుమార్ – హీరో అల్లు అర్జున్‌లతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, చిత్ర నిర్మాతల మీద ఇతర సాంకేతిక నిపుణులపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    Also Read: థియేటర్​లో ఫ్యామిలీతో పుష్పరాజ్​ సందడి.. ఎగబడిన అభిమానులు