RRR Movie Ticket Prices: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే కనిపిస్తోంది. గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక్క సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఇంత చర్చ సాగుతోంది. కొన్ని చోట్ల సినిమా విషయంలో జరుగుతున్న సరికొత్త పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొన్న థియేటర్లలో ముళ్ల కంచెలు పెట్టడం ఎంత చర్చనీయాంశం అయిందో అందరం చూశాం.
అయితే ఇప్పుడు మరో పెద్ద సవాల్ ఏంటంటే.. ఆర్ ఆర్ ఆర్ టికెట్లు సంపాదించడం. ఇదే ఇప్పుడు సినీ అభిమానులకు పెద్ద టాస్క్ లా మారిపోయింది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ల రేట్లు భారీగా పెరిగిపోయాయి. అంత పెంచినా కూడా దొరకట్లేదు. దీంతో టికెట్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే ఏపీలో టికెట్ల విషయంలో కఠినమైన రూల్స్ అమలులో ఉన్నాయి.
Also Read: టీఆర్ ఎస్ నేతల్లో ఐటీ దాడుల గుబులు.. కేంద్రం గట్టిగానే డిసైడ్ అయిందా…?
ఈ మూవీ బడ్జెట్ ఎక్కువ కాబట్టి టికెట్ మీద రూ.75 వరకు పెంచుకోవచ్చని జగన్ పర్మిషన్ ఇచ్చేశారు. కాకపోతే చాలా చోట్ల టికెట్లను బ్లాక్‌లో అమ్మేస్తున్నారంటూ వార్తలు వస్తుండటంతో ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగిపోయారు. చాలా చోట్ల ఒక్కో టికెట్ రూ.1500 దాకా అమ్ముతున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆయా థియేటర్ల ఓనర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
చాలా చోట్ల థియేటర్లకు ఓనర్లకు నోటీసులు కూడా ఇచ్చారు. ఎక్కవ రేట్లకు టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కొత్త వలసలోని మూడు థియేటర్లకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇలా చాలా ప్రాంతాల్లో థియేటర్ల ఓనర్లకు తాము నిర్ణయించిన దాని కంటే ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మొద్దంటూ తేల్చి చెప్పేస్తున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఎక్కువై.. రాంచరణ్ తక్కువైనా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు
Recommended Video: