Jabardasth Dorababu: జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది. బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందిన ఆది గురించి వేరే చెప్పనక్కరలేదు. స్టేజీ మీద ఎంత సరదాగా ఉంటాడో అంతే సరదాగా తన తోటి వారి యోగ క్షేమాల గురించి కూడా పట్టించుకుంటాడు. తను ఎదగడం కాదు తన చుట్టు ఉన్న వాళ్లు కూడా ఎదగాలనే మంచి గుణం ఉన్న నటుడు హైపర్ ఆది. తన టీంను ముందుకు నడిపించడంలో ఆయన వేసే పంచులకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో సీనియర్ నటులకన్నా ఆది ఎంతో అడ్వాన్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆది తన స్కిట్లతో ప్రేక్షకులన నిత్యం నవ్విస్తుంటాడు. పంచులతో చెలరేగిపోతుంటాడు. తన టీం విజయంలో ఆయనదే కీలక పాత్ర. తోటి వారికి కూడా చేయూతనిస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు కూడా ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆయన టీంలో రైజింగ్ రాజు, దొరబాబు, పరదేశి వంటి నటులున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఆదుకోవడం చూస్తుంటాం.
ఇప్పటికే పరదేశి ఓ యూ ట్యూబ్ చానల్ ప్రారంభించగా దాని ఎదుగుదల కోసం ఆది తన వంతు సాయం చేస్తున్నాడు. అందులో తన ఇంటర్వ్యూ ఇచ్చి దాని డెవలప్ మెంట్ కు తోడ్పాటునందిస్తున్నాడు. దీంతో స్కిట్లలోనే కాదు బయట కూడా వారి వ్యాపారాలు సజావుగా సాగాలని కోరుకోవడం ఆదికున్న మంచి గుణంగా చెబుతుంటారు. దీంతో ఆయనలో ఉన్న దయాగుణంపై అందరు ప్రశంసిస్తుంటారు.
Also Read: Samantha: కుమార్తె పెళ్లి కోసం కాదు… ఆమె చదువు కోసం డబ్బు దాచి పెట్టండి : సమంత
మరో నటుడు దొరబాబు కూడా ఆర్థికంగా ఎదగాలని భావించాడు. నగరంలో ఓ టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. దీనికి హైపర్ ఆది సంపూర్ణ సహకారం అందించారు. జబర్దస్త్ టీం సభ్యులు అందరు వచ్చి ప్రచారం చేశారు. దీంతో ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆశిస్తున్నారు. తోటి సభ్యులు ఎదిగేందుకు ఆది తీసుకుంటున్న చర్యలపై అందరు ప్రశంసిస్తున్నారు. తోటి వారిని ఆదుకోవాలన్న ఆయన గుణాన్ని మెచ్చుకుంటున్నారు.