Rajamouli : రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం లో ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన #RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన విస్ఫోటనం గురించి అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, కేవలం మన ఇండియన్ ఆడియన్స్ ని మాత్రమే కాదు. విదేశీయులను కూడా ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది. ఫలితంగా ఆస్కార్ అవార్డును కూడా ఈ చిత్రం సొంతం చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఇక నెట్ ఫ్లిక్స్ లో అయితే ఈ సినిమా దాదాపుగా 22 వారాలు ట్రెండ్ అయ్యింది. హాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాని చూసి ఆశ్చర్యపోయారు. ‘అవతార్’, ‘టైటానిక్’ లాంటి అద్భుతాలను తీసిన జేమ్స్ కెమరూన్ వంటి వారు కూడా ఈ సినిమాని చూసి రాజమౌళి ని పొగడ్తలతో ముంచి ఎత్తారు. అయితే ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ‘కొమరంభీముడో’ పాట కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది.
Also Raed : మహేష్ పని ఇక అయిపోయినట్టే..రాజమౌళి ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదుగా!
రీసెంట్ గా ఈ చిత్రం డాక్యుమెంటరీ ని జపాన్ లో విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న రాజమౌళి ని అక్కడి విలేఖరులు ‘కొమరం భీముడో’ పాట గురించి ప్రస్తావించారు. దీనిపై రాజమౌళి సమాధానం ఇస్తూ ‘కొమరం భీముడో వంటి కఠినమైన పాటను నేను సులభంగా చిత్రీకరించానంటే అందుకు కారణం ఎన్టీఆర్. అతను ఒక అద్భుతమైన నటుడు అనే విషయం మీ అందరికి తెలుసు, కానీ ఈ పాటలో మాత్రం ఎన్టీఆర్ నటన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తన శరీరంలోని ప్రతీ అణువుతో హావాభావాలు పలికించాడు. నేను కేవలం ఎన్టీఆర్ ముఖం పై కెమెరా పెట్టి చిత్రీకరించాను, అంతకు మించి నేను చేసిందేమి లేదు. కొరియోగ్రాఫర్ కి కూడా ఈ పాట క్రెడిట్ లో కచ్చితంగా భాగం ఉంటుంది. ఆ పాటలో ఎన్టీఆర్ ఎలా హింసించాలి వంటి ఐడియా లు కొరియోగ్రాఫర్ ఇచ్చిందే’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టేందుకు కాస్త గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆయన #RRR మూవీ డాక్యుమెంటరీ ప్రొమోషన్స్ కోసం జపాన్ కి వెళ్ళాడు. ఈ డాక్యుమెంటరీ ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు థియేటర్స్ ని ఎంచుకొని విడుదల చేశారు. కానీ రెస్పాన్స్ నిల్, అయినప్పటికీ కూడా ఇదే డాక్యుమెంటరీ ని జపాన్ లో విడుదల చేయాలి అనే ఆలోచన రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ అందుబాటులోనే ఉంది. ఎవరైనా చూడాలని అనుకుంటే వెళ్లి చూడండి. ఎన్టీఆర్, రామ్ చరణ్ పడిన కష్టాలు చూస్తే కన్నీళ్లు రాక తప్పదు.
Also Read : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!