తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు(Lokesh Kanakaraj)…ఈయన చేసిన విక్రమ్ (Vikram) సినిమాతో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న ‘కూలీ’ (cooli) సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటుగా లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) రామ్ చరణ్ (Ram Charan) తో చేయబోతున్నాడు అంటూ తమిళ్ మీడియాలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక దానికి తగ్గట్టుగానే రామ్ చరణ్ తో ఒక పిరియాడికల్ డ్రామా స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు (Buchhi babu) డైరెక్షన్లో పెద్ది (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డివంగా(Sandeep Reddy Vanga) డైరెక్షన్లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
Also Read : సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్.. ఢిల్లీ జట్టుకు సపోర్ట్ చేసిన రామ్ చరణ్ తేజ్.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్
అయితే లోకేష్ కనకరాజ్ ఈ మూడు సినిమాల తర్వాత రామ్ చరణ్ తో ఒక భారీ పిరియాడికల్ డ్రామా సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక ఇప్పటికే ఆయన ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. మొత్తానికైతే లోకేష్ కనకరాజు తన స్టైలిష్ మేకింగ్ తో రామ్ చరణ్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్రొజెక్ట్ చేస్తాడు అంటూ రామ్ చరణ్ అభిమానులు భారీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనగానే పాన్ ఇండియా వైడ్ గా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవున్నాయి. ఇక ఎప్పుడు వచ్చినా కూడా ఆ సినిమాకి మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. అయితే లోకేష్ కనకరాజు కూలీ సినిమా తర్వాత ఖైదీ 2 (Khaidi 2) సినిమాని తెరకెక్కించే పనిలో బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది.
ఇక దాంతో పాటుగా విక్రమ్ 2 (Vikram 2) సినిమా ని కూడా సెట్స్ మీదకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ భారీ విజయాలను సాధించగలిగే కెపాసిటి ఉన్న ఈ దర్శకుడు ప్రస్తుతం ఎలాంటి పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
Also Read : రామ్ చరణ్ దెబ్బ కి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందా..?