https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌ ఎప్పుడో తెలుసా..!

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో చిత్రం ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అసలు ఎప్పుడు షూటింగ్‌ పూర్తవుతుంది..? ఎప్పుడు సినిమా రిలీజ్‌ అవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కారణంగా అభిమాన హీరోలు ఎన్టీఆర్‌‌, చరణ్‌ కూడా ఏళ్ల తరబడి వేరే సినిమాలకు దూరమయ్యారు. Also Read: రెండు రీమేక్‌లు.. రెండు ఫ్లాష్‌బ్యాక్‌లు.. ఆ సినిమా వాళ్ల కెరీర్‌‌కు ఎంత హెల్ప్ చేస్తుందో అన్నది […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 / 01:19 PM IST
    Follow us on


    దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో చిత్రం ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అసలు ఎప్పుడు షూటింగ్‌ పూర్తవుతుంది..? ఎప్పుడు సినిమా రిలీజ్‌ అవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కారణంగా అభిమాన హీరోలు ఎన్టీఆర్‌‌, చరణ్‌ కూడా ఏళ్ల తరబడి వేరే సినిమాలకు దూరమయ్యారు.

    Also Read: రెండు రీమేక్‌లు.. రెండు ఫ్లాష్‌బ్యాక్‌లు..

    ఆ సినిమా వాళ్ల కెరీర్‌‌కు ఎంత హెల్ప్ చేస్తుందో అన్నది పక్కన పెడితే ఆ ఇద్దరు హీరోల తరువాత సినిమాలు ఓ టైమ్ షెడ్యూలు అన్నది లేకుండా ఆగిపోయాయి. ఆర్ఆర్ఆర్ యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ తరువాత ఇక ఆర్ఆర్ఆర్ షూట్ ఉండదట. అక్కడితో అది పూర్తయిపోతుంది.

    Also Read: `కేజీఎఫ్ 2’లో బాలయ్య బాబు.. నిజం కాదు !

    ఇక ఆ తర్వాత ఇద్దరు హీరోలు కూడా రాజమౌళి జైలు నుంచి రిలీజ్‌ అవుతారు. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదకు వెళ్లిపోతారు. అప్పటి నుంచి హీరోలు ఒకరు తివిక్రమ్ సినిమా మీదకు, మరొకరు కొరటాల శివ సినిమాకు వెళ్లిపోతారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు రాజమౌళి ఆరు నెలలు టైం బౌండ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబర్ కు సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అనుకున్న ప్లాన్‌ ప్రకారం.. జూన్‌ లేదా జూలైలో ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు నడుస్తున్న షెడ్యూల్‌ ప్రకారం ఆ టైమ్‌కు సినిమా విడుదల కావడం కష్టంగానే కనిపిస్తోంది. షూటింగ్‌ పూర్తి చేసి.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ చేసే సరికి మరో ఆరు నెలల టైం ఖచ్చితంగా పడుతుందని సమాచారం. అందుకే.. సినిమా రిలీజ్‌లో మరింత ఆలస్యం కాక తప్పడం లేదు.