Homeఎంటర్టైన్మెంట్katrina kaif: ఎంచుకున్న రాగం ఏది?.. ఆ పాట శృతి ఏది?.. కత్రినా హాట్​సాంగ్​పై నెటిజన్లు...

katrina kaif: ఎంచుకున్న రాగం ఏది?.. ఆ పాట శృతి ఏది?.. కత్రినా హాట్​సాంగ్​పై నెటిజన్లు ఫైర్​!

katrina kaif: బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​, కత్రినా కైఫ్​ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సూర్య వంశీ. ప్రస్తుతం ఈ సినిమా నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలోని టిప్​-టిప్​ బర్సా పానీ పాటే కారణంయ ఈ పాటలో కత్రినా స్టైల్​ కాస్త ఇబ్బంది కలిగించేలా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, 1994లో వచ్చిన మొహ్రాలో టిప్​ టిప్​ బర్సా పానీ పాట అందరికీ సుపరిచితమే. ఇందులో  రవినా టాండన్​, అక్షయ్​ కుమార్​ల కమెస్ట్రీ అద్భుతంగా కనువిందు చేసింది.

ఉత్తరాది, దక్షిణాది తేడాల్లేకుండా ఎవర్​గ్రీన్ సూపర్​ హిట్​గా నిలిచిన పాట ఇది. అంతలా అభిమానుల మనసు దోచుకున్న ఈపాటను, అందులోని హీరో హీరోయిన్ల కెమిస్ట్రీని సినీ ప్రేమికులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఆడియో క్యాసెట్లు నడుస్తున్న కాలంలో ప్రతి ఇంట్లో ఈ పాటే వినపడుతుండేది.  ఆకాశ‌వాణీ వివిధ భార‌తి ప్రోగ్రామ్‌లో ఎక్కువ సార్లు వినిపించిన పాట కూడా ఇదే..

https://youtu.be/l9u8Zb4fY1c

అయితే, తాజాగా రీమేక్​ చేసిన ఈ సాంగ్​లో అప్పటి రవీనా పాత్రలో కత్రినా తన హాట్​నెస్​తో ప్రజల హృదయాల్లో నిలిచింది. దీంతో నెటిజన్లు సోషల్​ మీడియాలో ఇద్దరినీ పోల్చడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్​ మీడియాలో పెద్ద యుద్దం నడుస్తోంది. రవినా టాండన్ చేసిన మ్యాజిక్‌ను.. కత్రినా బీట్​ చేయలేకపోయిందంటూ నెటిజన్లు హీట్ పెంచుతున్నారు.

 

ఆ హాట్​ బ్యూటిఫుల్​ రెయిన్​ సాంగ్స్​లో టిప్​టిప్​ బర్సాపానీ అగ్రస్థానంలో ఉంది. అలాంటి అద్భుతమైన సాంగ్​ను ఎలా రీమిక్స్​ చేస్తారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీమిక్స్​ చేసేసాహసం సూర్యవంశీ టీమ్​కు ఎలా వచ్చిందని అంటున్నారు.  ఆ పాటలోని టెంపో ఏదీ? ఆ బీట్ ఏదీ? మీరు ఎంచుకున్న శ్రుతేమిటి? ఆ పాట శ్రుతేమిటి? మేము ఏదో ఊహించుకుంటాం.. మీరు మాత్రం అక్క‌డ‌కు రారు! అని కత్రినాకైఫ్‌కే కాదు.. అక్ష‌య్ కుమార్‌కు కూడా సోషల్​ మీడియాలో క్లాస్ పీకుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular