RRR Movie: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ల నాలుగేళ్ల కష్టం వెండి తెర మీద ఆవిష్కృతం కావడానికి కరోనా అడ్డు తగులుతున్నది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ట్టకేలకు ఈ నెల 7న విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ వలన మళ్లీ పోస్ట్ పోన్ అయింది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఈ మూవీపై అభ్యంతరం తెలుపుతూ ఓ యువతి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేసింది. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిక్కుల్లోకి వెళ్లినట్లయింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏమని కేసు వేసిందంటే..
హైదరాబాద్ హై కోర్టులో ఏపీలోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య కోర్టులో పిల్ దాఖలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌లో తారక్, చరణ్ చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. కాగా, ఇందులో చారిత్రక యోధుల పాత్రలను రాజమౌళి వక్రీకరించి చిత్రీకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మహనీయుల అసలు చరిత్ర కాకుండా కాల్పనిక కథతో సినిమా తెరకెక్కించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Also Read: ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఇవ్వాలట.. ఉమైర్ సంధు ట్వీట్ వైరల్
పిక్చర్‌కు ఇప్పటికే జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయడంతో పాటు చిత్ర విడుదలను నిలిపివేయాలని అల్లూరి వంశానికి చెందిన సౌమ్య కోరింది. మహనీయుల జీవితాలకు వ్యతిరేకంగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారని ఆరోపించింది. గొప్ప యోధుడైన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ ఆఫీసర్‌గా పనిచేయడాన్ని తప్పుబట్టింది. పిటిషన్‌లో ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్, మూవీ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య, డైరెక్టర్ రాజమౌళి, రైటర్ విజయేంద్ర ప్రసాద్‌లను చేర్చింది. అలా ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌పై హైకోర్టులో కేసు దాఖలు కాగా, ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇస్తుందోనని ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
సినిమా విడుదల కోసం ఇంతకాలం వేచి చూసి సినీ అభిమానులు ఇప్పుడు ఆ చిత్రంపై దాఖలయిన కేసును గురించి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్స్ గ్రాండ్‌గా జరిగాయి. ముంబై, చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లిమరీ ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, ప్రొడ్యూసర్ ప్రమోషన్స్ చేశారు. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితుల నేపథ్యంలో మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.
Also Read: అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తిన ఆర్జీవి… వాళ్ళు చేయలేనిది నువ్వు చేశావంటూ ?